Search
Monday 24 September 2018
  • :
  • :

వింత ప్రపంచంలో అద్భుత ప్రయాణం

పిల్లలకు ఊహాలోకం ఇష్టం. వారికంటూ ప్రత్యేక ప్రపంచం సృష్టించుకోవడంలో ఆనందం పొందుతారు. ఆ ప్రపంచంలో వారు చెయ్యలేనిది ఏమీ లేదు. అందుకే అప్పటి చందమామ కథల నుంచి కార్టూన్ లోకం వరకు పిల్లలు అద్భుత లోకాన్ని వెతుక్కుంటారు. పిల్లలకు నచ్చే పుస్తకాల చిరు సమీక్ష ఇది..ఈ పుస్తకాన్ని మీ పిల్లలతో చదివించండి.
goldenగోల్డెన్ కంపాస్ పుస్తకాన్ని ఫిలిప్ పుల్‌మాన్ రాశాడు. ఈ పుస్తకంలోని హీరోయిన్ లిరా బెలెక్వాకి 11 గాయత్రి పెద్ద అభిమాని. ఆ అమ్మాయి ఈ పుస్తకం గురించి సమీక్ష రాసింది. లిరా బెలెక్వా ఒక అనాధ. ఆ అమ్మాయి ఒక ప్రత్యేక ప్రపంచంలో జీవిస్తుంది. అక్కడ జనం కొంత వారి ఆత్మ నుంచి ఇంకొంత బయట నుంచి ఆలోచిస్తారు. అంటే ఆ సగం ఆత్మ జంతువు లాగా ఉంటుంది.

దానికి ఎప్పుడు ఏ ఆకారం కావాలంటే అది పొందుతుంది.ఆ భాగాన్ని డేమన్ అంటారు. అది మాట్లాడగలదు. ఒకవేళ ఈ డెమాన్‌ను చంపేస్తే మానవ భాగం కూడా చనిపోతుంది. ఆమె ప్రపంచంలో ఇంకో వింతైన విషయం, డస్ట్. దాన్ని పెద్ద డితో సూచిస్తారు. ఇది మంచి, ఇది చెడు అని లిరాకి తెలీదు. ఎవరికీ ఆమెకు చెప్పడం ఇష్టం ఉండదు. ఆమె ఫ్రెండ్ రోగర్‌తో కలిసి వారిద్దరి డేమన్‌లు డస్ట్‌ని వెతుకుతారు. వారి ప్రయాణంలో లిరా, తాను అనాధ కాదని తెలుసుకుంటుంది. లార్డ్ ఆస్రియల్ అనే ఒక శక్తివంతమైన వ్యక్తిని అంకుల్ అని పిలుస్తుంది. అతనే తన తండ్రి అని తెలుసుకుంటుంది. అలా ఆమె వింత ప్రపంచం, అందులో ఆమె చేసే ప్రయాణం పిల్లలకు చదవడానికి చాలా బావుంటుంది.

Comments

comments