Home జాతీయ వార్తలు బాలీవుడ్ నటి పేరిట నకిలీ ఆధార్

బాలీవుడ్ నటి పేరిట నకిలీ ఆధార్

URWASHI

ముంబయి : బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా పేరిట కొందరు వ్యక్తులు నకిలీ ఆధార్ కార్డు సృష్టించారు. అనంతరం ఆమె పేరు చెప్పి బాంద్రా ప్రాంతంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో వారు ఉచితంగా బస చేశారు. వీరిపై అనుమానం రావడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఈ క్రమంలో పోలీసులు ఊర్వశి రౌతెలాకు నోటీసులు పంపించారు. ఈ విషయం తెలిసి ఊర్వశి షాకయ్యారు. తనను పోలీసు కేసులో ఇరికించేందుకే నకిలీ ఆధార్ కార్డును తయారు చేశారని, దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన బాంద్రా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ కేసును ఛేదించేందుకు సైబర్ నిపుణుల సాయం తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Fake Aadhaar in the name of Bollywood actress