Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

కల్తీ పత్తి విత్తనాల ముఠా అరెస్టు, రిమాండ్

Farmers Facing Soya Fake Seeds In Kamareddy Dist

మన తెలంగాణ/కామారెడ్డి: కల్తీ పత్తి విత్తనాలను తరలిస్తున్న ముఠాను భిక్కనూరు టొల్‌ప్లాజా వద్ద పట్టుకున్నామని శుక్రవారం కామారెడ్డి డిఎస్పి ప్రసన్న రాణి తెలిపారు. డిఎస్పి కార్యాలయంలో విలేకరుల సమావేశ ంలో వివరాలు వెల్లడించారు. టోల్‌ప్లాజా వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా రూ.2.95 లక్షల రూపాయల విలువైన 96 కల్తీ పత్తి విత్తనాల బ్యాగులను స్వాధినం చేసుకున్నామని డిఎస్పి వెల్లడించారు. వాహనాలను తనిఖి చేస్తుండగా టిఎస్ 34 పి 0085 స్విఫ్ట్ డిజైర్ కారు హైదరాబాదు నుండి కామారెడ్డి వస్తుండగా భిక్‌నూర్ ఎస్సై రాజు గౌడ్ కల్తీ విత్తనాలు పట్టుకున్నారని డిఎస్పి తెల్పారు.
కారులో 6 పత్తి విత్తనాల బ్యాగులను గమనించి వారి వద్ద ఎటువంటి బిల్లులు లభించకపోవడంతో వాటిని స్వాధినం చేసుకున్నారన్నారు. కారులో హర్ష——_55బిజి_2 అని పేరు ముద్రించబడిన 296 కల్తీ పత్తి విత్తనాల ప్యాకేట్లను స్వాధీనం చేసుకున్నారన్నారు. మొత్తం 6 బ్యాగుల్లో 296 ప్యాకేట్లు ఉన్నాయన్నారు. ఇవి నకిలి పత్తి విత్తనాలుగా నిర్దారించామన్నారు. వీటి విలువ 2.96 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. కారులో ఉన్న వారిని విచారించగా విత్తనాలను సికింద్రాబాదులోని భరత్‌కుమార్ పటేల్ వద్ద తీసుకోస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం ఎల్లం కొండ గ్రామానికి చెందిన సంతల కరుణారెడ్డి, బొడ యాదగిరి, కరివేణి గోవర్దన్, గూడెం పరమేశ్, పెంటని విజయ్‌కుమార్‌లకు కల్తీ విత్తనాలతో సంబందం ఉందని విచారణలో తెలిందన్నారు. కల్తీ ముఠాతో సంబందం ఉన్న ఐదుగురిని ఆరెస్టు చేసి రిమాండ్‌కు పంపామన్నారు. సమావేశంలో టౌన్ సిఐ శ్రీదర్ కుమార్, భిక్‌నూర్ ఎస్సై రాజుగౌడ్, మాచారెడ్డి ఎస్సై క్రిష్ణమూర్తి, ఎడిఎ నరసింహరెడ్డి, కానిస్టేబుల్లు రవి, నరేశ్, రామస్వామి, రమేష్ తదితరులు ఉన్నారు.

Comments

comments