Home కుమ్రం భీం ఆసిఫాబాద్ నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

Fake Cotton Seedsకుమ్రంభీం ఆసిఫాబాద్ : భారీ ఎత్తున నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. ఈ ఘటన చింతమనేపల్లి మండలం  గంగాపూర్‌లో  బుధవారం ఉదయం జరిగింది. గంగాపూర్ కు  చెందిన శ్రీనివాస్ ఇంట్లో భారీగా నకిలీ పత్తి విత్తనాలు నిల్వ ఉన్నట్టు సమాచారం అందడంతో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో రూ.20 లక్షల విలువైన . నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నిందితుడు శ్రీనివాస్ ను అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. నకిలీ విత్తనాల గురించి పోలీసులకు, వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని వారు రైతులను కోరారు. నకిలీ విత్తనాలు, ఎరువులు కొని మోసపోవద్దని వారు సూచించారు.

Fake Cotton Seeds Seized In Gangapur