Home రంగారెడ్డి వేటుకు వేళాయే!

వేటుకు వేళాయే!

Fake Doctor Suspended In Rangareddy District

నకిలీ మెడికల్ దృవపత్రాలు పెట్టి మంచి పోస్టింగ్ సంపాధించుకోవడానికి ప్రయత్నించిన పంతుళ్లపై చర్యలకు రంగం సిద్దం అవుతుంది. లేని రోగం ఉన్నట్లు, కొద్దిగా ఆరోగ్య సమస్య ఉంటే దానిని ఎక్కువ చూపిస్తు నకిలీ మెడికల్ దృవపత్రాలను సృష్టించి ప్రిపరెన్షియల్ కేటాగిరి బదిలీలలో అదనపు పాయింట్‌లు సాధించడానికి చేసిన ప్రయత్నం కాస్తా బెడిసి కొట్టింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నగర శివారు పోస్టింగ్‌లు సంపాధించుకోవడానికి ఉపాధ్యాయులు అడ్డదారులు తొక్కినట్లు పెద్ద ఎత్తున విమర్శలు వినిపించడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దరఖాస్తులు సమర్పించిన వారినందరిని కొండాపూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి పరిశీలించారు. 136 మందిలో 125 పరీక్షలు నిర్వహించగా అందులో ఎడు మంది సమర్పించిన వైద్య పరీక్షల దృవీకరణ పత్రాలలో లేని రోగం ఉన్నట్లు, ఉన్న రోగం అధికంగా ఉన్నట్లు మెడికల్ బోర్డు ప్రాథమికంగా గుర్తించింది. 11 మంది ఉపాధ్యాయులకు న్యూరో సంబందిత పరీక్షలు త్వరలో చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని రాయపోల్, బాటసింగారం, శివరాంపల్లి , తంగడిపల్లి పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న నలుగురు స్కూల్ అసిస్టెంట్‌లతో పాటు వికారాబాద్ జిల్లాలో ముగ్గురు ఉపాధ్యాయులపై చర్యలకు రంగం సిద్దం అవుతుంది. వినికిడి లోపం, శారీరక వైకల్యం తక్కువగా ఉన్న అధికంగా ఉన్నట్లు దృవీకరణ పత్రాలను తీసుకువచ్చి సమర్పించినట్లు తెలిసింది. రాజకీయ వత్తిడుల మూలంగా ఇప్పటివరకు చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేసిన అధికారులు ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించడానికి సిద్దమయ్యారు. నకిలీ వైద్య దృవీకరణ పత్రాలను సృష్టించి బదిలీల కోసం దరఖాస్తు    చేసుకున్న        మెదక్,  మహబుబ్‌నగర్ జిల్లాలో ఇప్పటికే పలువురు సస్పెండ్ చేసిన రంగారెడ్డి జిల్లాలో మాత్రం కాస్తా ఆలస్యంగా చర్యలు తీసుకోవడానికి సిద్దమవుతున్నారు. మిగత జిల్లాల మాధిరిగా సస్పెండ్ చేస్తారా లేక షోకాజ్ నోటిసులతో సరిపెడతారా అన్న చర్చ సాగుతుంది. రెండు రోజుల్లో షోకాజ్ నోటిసులు జారీచేసి వారి వివరణ తీసుకున్న అనంతరం చర్యలు చేపడుతామని విద్యాశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.