Search
Friday 20 July 2018
  • :
  • :
Latest News

నకిలీ వైద్యులపై నిఘా..

Fake Doctors Findout Ibn Nizamabad District

మన తెలంగాణ/నిజామాబాద్: నగరంలో నకిలీ వైద్యులను ఏ రివేసేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రజలు కూడా నకిలీ వైద్యానికి బలి కావద్దని సూ చిస్తున్నారు. ఎక్కడైనా అర్హతలేని వారు వైద్యసేవలు అందిస్తున్న ట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు లేదా వైద్యాధికారులకు స మాచారం ఇవ్వాలని తెలుపుతున్నారు. నకిలీ వైద్యాన్ని అరికట్ట డంతో పాటు నకిలీ వైద్యులపై జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారు లు చర్యలు తీసుకోనున్నారు.
కొండంత ఆశతో వస్తే….
జబ్బు తగ్గుతుందని రోగులు కొండంత ఆశతో నకిలీ వైద్యులను సంప్రదించి ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. ప్రతి వారంలో ఒకచోట వైద్యం వికటించి ఏదో ఓ సంఘటన చోటుచేసుకుంటు నే ఉంది. కొన్నిచోట్ల మాత్రం ఈ సంఘటనలు బయటపడుతు న్నాయి. మరి కొన్నిచోట్ల బాధితులతో నకిలీ వైద్యులు సెటిల్ మెంట్ చేసుకుంటూ యథేచ్ఛగా ఆసుపత్రులను నడిపిస్తున్నా రు. శివారు ప్రాంతాల్లో నకిలీ వైద్యులు అధిక సంఖ్యలో ద ర్శనమిస్తున్నారు. ఈ ప్రాంతాలపై ఆయా జిల్లాల వైద్యాధికారు లు పెద్దగా పట్టించుకోకపోవడంతో వీరి వైద్య బిజినెస్ మూడు పూవులు ఆరు కాయాలు అనే చందంగా సాగుతోంది.
ఫీజు తక్కువగా ఉండటంతో….
నగరంలో వైద్యుల ఫీజులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. చిన్నపాటి జ్వరంతో బాధపడుతూ ఎంబిబిఎస్ వైద్యులను సంప్రదిస్తే రూ.200నుం చి రూ.500వరకు తీసుకుంటున్నా రు. అదే స్పెషలిస్ట్ అయితే ఇంతకు పైగానే ఉంటుంది. ఇవి కాకుండా మందులు ఇంజెక్షన్‌లు అన్ని తీసుకు నే సరికి సాధారణ జ్వరానికి మొత్తం రూ.1000 వరకు అవుతోంది. అయితే బస్తీల్లో నివసించే వారిలో పలువురు ఇంత మొత్తాన్ని చెల్లించ స్తోమతలేకపోవడంతో ఈ వైద్యులను సప్రందిస్తున్నట్లు తెలు స్తోంది. నకిలీవైద్యుల వద్ద ఫీజులు వీరికంటే చాలా తక్కువగా ఉంటుండటంతోనే వీరిని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.
శివారు ప్రాంతాలే టార్గెట్….
నకిలీ వైద్యులు నగర శివారు ప్రాంతాల్లోనే అధికంగా పాగా వే స్తున్నారు. కేవలం రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ (ఆర్‌ఎంపి) వై ద్యులు వారి ఇష్టానుసారంగా బోర్డులను బిగించుకొని ఎంబిబి ఎస్ అవతారాలు ఎత్తుతున్నారు. శివారు ప్రాంతాల్లో నివసించే వారికి ఎక్కువగా అవగాహన ఉండదు. వారికి వైద్యం, వైద్యుల పట్ల పెద్దగా తెలియదు, అనారోగ్యానికి గురైన వెంటనే ఈ వై ద్యుల వద్దకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. పలు ప్రాంతాల్లో ఈ నకిలీ వైద్యుల వైద్యానికి మృత్యువాత చెందిన వారు కూడా ఉన్నారు.
ప్రభుత్వాసుపత్రులకు వెళ్లండి….
మీ ప్రాతంల్లో ఉండే ఆసుపత్రుల్లో వైద్యు ల గురించి ముందుగా తెలుసుకోండి. అసలు ఆయన వైద్యుడేనా? ఇంతకు ముందు ఎ క్కడెక్కడ పని చేశాడు? ఏం చదువుకున్నాడు అనే విషయాలను తప్పని సరిగా తెలుసుకోని వైద్యాన్ని పొందాల్సివ బాధ్యత రో గులపైనే ఉంది. అవగాహనలేని నకిలీ వైద్యుల వద్దకు వెళితే రో గం మరింత ముదిరి ప్రాణాల మీదకు వస్తోంది. నగరంలోని అ న్ని ప్రాంతాల్లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,బస్తీ ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు ఉన్నాయి ఈ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి ఉచిత వైద్యాన్ని పొందండి.

Comments

comments