Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

కలకలం రేపిన నకిలీ వేలిముద్రల వ్యవహారం

Accused

పెద్దపల్లి: దేశవ్యాప్తంగా నకిలీ వేలిముద్రల వ్యవహారం కలకలం రేపింది. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో నకిలీ వేలిముద్రల తయారీ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ధర్మారం పాత బస్టాండ్ దగ్గర నిందితుడు సంతోష్ కంప్యూటర్ సెంటర్‌లో సిమ్‌లు యాక్టివేషన్ టార్గెట్ చేరుకోవడానికి నకిలీ వేలిముద్రలు తయారుచేశారు. సిమ్‌లు యాక్టివేట్ చేయడం కోసం ఆరు వేల నకిలీ వేలిముద్రలు తయారు చేశాడు. పోలీసులు సంతోష్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని ధర్మారం పోలీసులకు డిసిపి ఆదేశాలు జారీ చేశారు.

Comments

comments