Search
Wednesday 26 September 2018
  • :
  • :

హైదరాబాద్‌లో ఘరానా ముఠా అరెస్ట్..

Hyderabad-cp

హైదరాబాద్ : ఉద్యోగాలు, బ్యాంకు రుణాలు, వైద్యసీట్లు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్నఘరానా ముఠాను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. సిపి అంజనీ కుమార్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ ముగ్గురు నిందితులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో పలువురిని మోసం చేసినట్టు సిపి పేర్కొన్నారు. నిందితులు రూ. 3 కోట్ల మేర మోసాలకు పాల్పడినట్టు విచారణలో తేలిందన్నారు. వీరిపై మూడు రాష్ర్టాల్లో 9 కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. ముఠా సభ్యుల నుంచి రూ. 45 లక్షలు, పలు డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బాగా చదువుకున్న వారేనని ఆయన చెప్పారు. యూనివర్సల్ యాక్సిస్ ఇండియా పేరుతో కంపెనీని స్థాపించారని తెలిపారు. ఎంఎస్ ప్రైమ్‌టెక్ పేరుతో మరో కంపెనీ స్థాపించి మోసాలు పాల్పడ్డారని అంజనీ కుమార్ స్పష్టం చేశారు. ఇదివరకే నిందితులు పలు కేసుల్లో అరెస్టయ్యి బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చారని సిపి అంజనీ కుమార్ తెలిపారు.

Comments

comments