Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

కామన్వెల్త్ గేమ్స్ కవర్ చేస్తున్నామన్న నకిలీ జర్నలిస్టులు అరెస్టు

sprts

బ్రిస్బేన్: గోల్డ్‌కోస్ట్‌లో ఏప్రిల్ 4 నుంచి ఆరంభం కానున్న ‘కామన్వెల్త్ గేమ్స్’ కవర్ చేస్తున్న జర్నలిస్టులమని చెప్పుకున్న కొందరు భారతీయులను ఆస్ట్రేలియా అధికారులు అక్కడికి చేరగానే అరెస్టు చేశారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో జరిగిన ఈ ఉదంతాన్ని గార్డియన్ పత్రిక పేర్కొంది. తప్పుడు పత్రాలతో మనుషులను అక్రమ రవాణా చేస్తున్నాడన్న అభియోగాన్ని రాకేశ్ కుమార్ శర్మ(46) అనే వ్యక్తిపై మోపినట్లు ఆస్ట్రేలియా బార్డర్ ఫోర్స్(ఎబిఎఫ్) తెలిపింది. బ్రిస్బేన్ విమానాశ్రయంలో భారతీయుల బృందాన్ని ప్రశ్నించారు. వారిలో ఎనిమిది మంది వద్ద నకిలీ మీడియా అక్రెడిటేషన్‌లు ఉన్నట్టు కనుగొన్నారు. అరెస్టు చేసిన వ్యక్తిని కస్టడీకి రిమాండ్ చేశారు. గురువారం బ్రిస్బేన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. ఒకవేళ అతడి నేరం రుజువైతే 20 ఏళ్ల జైలు శిక్ష పడనుంది. ఇతర ఎనిమిది మందిని వలస నిర్బంధంలోకి పంపించారు. ఆస్ట్రేలియాలోకి ప్రవేశించాలనుకునే వారు సరైన పత్రాలతో రావాలని ఎబిఎఫ్ ప్రాంతీయ కమాండర్ టెర్రీ ప్రైస్ తెలిపారు. ఈ విషయాలను బ్రిస్బేన్ డాట్ కామ్. ఎయు పేర్కొంది.

Comments

comments