Home కుమ్రం భీం ఆసిఫాబాద్ నకిలీ మావోయిస్టులు అరెస్ట్

నకిలీ మావోయిస్టులు అరెస్ట్

ARREST

కుమ్రంభీం ఆసిఫాబాద్ : ఇద్దరు నకిలీ మావోయిస్టులను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టుల పేరుతో కాంట్రాక్టర్లను బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న నకిలీలను అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్‌పి సన్‌ప్రీత్‌సింగ్ తెలిపారు. తిర్యాణి మండలం మంగిలో మిషన్ భగీరథ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ వెంకట్‌రావును తాము మావోయిస్టులమని, లక్ష రూపాయలు ఇవ్వాలని నకిలీ మావోయిస్టులు షేక్ రజక్ హుస్సేన్, బావండ్లపల్లి రవీంద్ర ప్రసాద్‌లు బెదిరించారు. దీంతో భయపడిన కాంట్రాక్టర్ వెంకట్‌రావు తన వద్ద ఉన్న ఆరు వేల నగదును వారికి ఇచ్చాడు. అనంతరం ఆయన ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నకిలీ మావోయిస్టులను అరెస్ట్ చేశామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని ఎస్‌పి వెల్లడించారు.