Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

బిత్తిరి సత్తిపై దాడి.. ఎవరు చేసుంటారో..??

Bittiri Satti Attackedతీన్మార్ వార్తలతో తెలంగాణ యాసలో, అమాయకపు మాటలతో తెలుగ ప్రేక్షకులకు బిత్తిరి సత్తి ఎంతో సుపరిచితుడైయ్యాడు. తీన్మార్ వార్తల్లో ప్రధాన మంత్రి మోడీ నుంచి సిఎం కెసిఆర్ వరకు అందరిపై సెటైర్లు వేస్తుంటాడు సత్తి. అదే విధంగానే కొద్ది రోజుల క్రితం ఎపికి ప్రత్యేక హోదా కోసం జనసేనా పార్టీ, ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ పాటలను రీమిక్స్ చేస్తూ కొన్ని పాటలను విడుదల చేసిన విషయంపై కూడా సైటర్ వేస్తూ సత్తి స్కిట్ చేశాడు.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌ను సత్తి వ్యంగ్యంగా సంభోధించడంపై ఆయన అభిమానులు పెద్ద ఎత్తున మండిపడ్డారు. సత్తి తన తీరును మార్చుకోకపోతే భౌతిక దాడులకు కూడా పాల్పడుతామని సోషల్‌మీడియా వేదికగా వాళ్లు వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సత్తిపై పవన్ అభిమానులు దాడి చేసినట్లు, ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఉన్న ఓ ఫోటో వాట్సాప్, సోషల్‌మీడియాల్లో హల్‌చల్ చేస్తుంది. అయితే నిజంగానే పవన్ అభిమానులు సత్తిపై దాడి చేశారా.. లేక ఇది కేవలం ఫేక్ వార్తా అనే విషయంపై క్లారిటీ లేదు.

Comments

comments