Search
Friday 16 November 2018
  • :
  • :

నకిలీ ఉత్పత్తుల తయారీ ప్లాంట్ స్వాధీనం

కార్డన్ సెర్చ్‌లో వెలుగు చూసిన అక్రమాలు

Fake Products manufacturing plant Seized by Policeకరీంనగర్ క్రైం : కార్డన్ సెర్చ్‌ల నిర్వహణ ద్వారా పలు అక్రమ కార్యకలాపాలు వెలుగులోకి వస్తు న్నాయి తాజాగా కరీంనగర్‌లోని హుస్సే న్‌పురా ప్రాంతంలో బుధవారం నకిలీ ఇంజన్ ఆయిల్, బ్యాటరీల్లో నింపేం దుకు ఉపయోగించే డిస్టిల్డ్ వాటర్, నాసిరకం యాసిడ్ ఉత్పత్తులను తయారు చేస్తున్న ప్లాంట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే క్రమంలో రేషన్ డీలర్ల వద్ద నుండి తక్కువకు కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్న 650 లీటర్ల కిరోసిన్‌ను త్రీటౌన్ పోలీ సులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం 6గంటల నుండి 8 గంటల వరకు 200మంది పోలీసులు నగరంలోని హుస్సేన్‌పురా పరిసర ప్రాంతాల్లో కమిషనర్ వి.బి కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్‌ను నిర్వ హించారు.

ఎవర్‌గ్రీన్ గోల్డెన్ పేరిట నకిలీ ఇంజన్ ఆయిల్‌ను ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. సరైన ధ్రువపత్రాలులేని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకు న్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిష నర్ వి.బి కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించేం దుకు కార్డన్ సెర్చ్ ఆకస్మిక వాహనాల తనిఖీలు, నాఖాబందీలను కొనసాగిసు న్నామన్నారు. అన్ని ప్రాంతాల్లోనూ ప్రజ ల సహకారం లభిస్తోందని తెలిపారు. సంఘ విద్రోహకర శక్తుల కదలికల నియంత్రణ, అక్రమాలకు అడ్డుకట్ట వేసేం దుకు దోహదపడుతున్న చర్యలను స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు.

Comments

comments