Home జోగులాంబ గద్వాల్ అవినీతి బాగోతం బయట పడేనా..!

అవినీతి బాగోతం బయట పడేనా..!

fake-seeds

నకిలీ విత్తనాల ల్యాబ్‌రిపోర్టులు
వెలుగుచూసేనా..?
అవినీతి బయటపడుతుందనే
భయంతో తొక్కిపెడుతున్న
అధికారులు జిల్లాలో రోజుకొక చోట నకిలీ
విత్తనాల పట్టివేత
చోద్యం చూస్తున్న అధికారులు

మనతెలంగాణ/గద్వాలప్రతినిధి: నకిలీ విత్తనాలు రోజుకొక చోట పట్టుబడుతూ జిల్లా ల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి… ఇటీవలీ ధరూరు, వడ్డేపల్లి, అయిజ, కే.టీ.దొడ్డి మండలాల్లో పోలీసులు జరిపిన తనిఖీల్లో నకిలీ పత్తి విత్తనాలు పెద్దఎత్తున బయట పడ్డాయి. ఒకపక్క నకిలీ విత్తనాల నివారణకు పోలీసు యంత్రాంగాం కట్టుదిట్ట మైన చర్యలు చేపడుతున్నప్పటికీ మరోవైపు వ్యవసాయ శాఖలో కొందరు అవి నీతి పరులైన అధికారులు అక్రమార్కులకు సాయం చేస్తుండడంతో నకిలీ విత్త నాల ముఠా యథేచ్చగా చెలరేగిపోతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తు న్నాయి. దీనికి బలం చేకూర్చేలా ఇటీవలీ జనవరి మాసంలో గద్వాల వ్యవసా య మార్కెట్ యార్డులో రూ.6.50కోట్ల విలువ గల నకిలీ పత్తివిత్తనాలలో అధి కారులపై వినిపిస్తున్న అవినీతి ఆరోపణలే ఇందుకు ఉదాహరణగా చెప్పవ చ్చు. వ్యవసాయ శాఖలో ఉన్న లొసుగులను వెసులుబాటు చేసుకుని వదిలిపె ట్టారనే బలమైన వాదనలు వినిపిస్తున్నాయి.

         ఇందులో పెద్ద మొత్తంలో చేతు లు మారినట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. అధికారులు ఇలా ఎవరికి వారే అమ్ముడు పోతుంటే మరోవైపు ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట లు నకిలీ విత్తనాల కారణంగా చేతికందకుండా పోతున్నాయనే ఆవేదనలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు దాపురించాయి. గత నాలుగేళ్లుగా సీడుపత్తి పంటలు సరిగ్గా రావడం లేదంటూ రైతులు పలుమార్లు ఆందోళనలు చేసిన దఖాలాలు చాలా ఉన్నాయి. సీడుపత్తి ఆర్గనైజర్లు కొనసాగిస్తున్న అక్రమా లు, నకిలీవిత్తనాల విక్రయ ముఠాలపై చర్యలు చేపట్టాలంటూ తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండారాం సైతం గద్వాలలో ఆందోళనలు చేశారంటే పరిస్థితి ఏస్థాయిలో ఉందో స్పష్టమవుతుంది.

మనతెలంగాణ/గద్వాలప్రతినిధి: ఇంతకి అసలు కథ ఏంది…?: నూతన జిల్లాలు ఏర్పడ్డ తరువాత అప్పటి ఎస్‌పీ విజయ్‌కుమార్ అక్రమ దం దాలు చేసే వారిపై నిఘా పెట్టి ఒక్కోక్కరి మక్కెలు ఇరదీస్తూ వచ్చారు. ఆక్రమంలోనే నకిలీ విత్తనాలు, పురుగు మందుల ముఠాను కూడ పట్టుకుని జైలుకు పంపడం జరిగింది. ఈక్రమంలోనే ఈఎడాది జనవరి మాసంలో గద్వాల మార్కెట్ యార్డులో పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన నకిలీ పత్తి విత్తనాలు లభ్యమైయ్యాయి. వీటి విలువ రూ.6.50కోట్లుగా వ్యవ సాయ అధికారులు తేల్చిచెప్పారు. అయితే వీటిని పట్టుకునే వరకు గట్టిగానే పనిచేసిన అధికారులు తరువాత ఏమి జరిగిందో తెలియదు… సీను మొత్తం పూర్తి రివర్స్ అయింది. కేవలం నామమాత్రంగా ఒక లాటులో మాత్రమే బీటీ-3 విత్తనాలు ఉన్నాయంటూ మిగతా విత్తనాలు మంచిగానే ఉన్నాయంటూ అధికారులు (నకిలీ విత్తనాలకు) సర్టిఫికేట్ ఇవ్వడం వెనకాల ఉన్న మతలాబు ఏమిటో ఇంతవరకు అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. వాస్తవంగా అధికారులు చెబుతున్నట్లు పట్టుబడిన విత్తనాలు నకిలీవి కాకుండా మంచి విత్తనాలు అయితే దానికి సంబం ధించిన ల్యాబ్‌రిపోర్టులను బయటపెట్టవచ్చు. కాని ఆపని సంబంధిత వ్యవసాయ అధికారులు చేయడంలేదు. పైగా ఆ విత్తనాలు ఏఏ రైతుల వద్ద సేకరించారో కూడ కనీస సమాచారం లేదు. ఇక్కడే అందరికి పెద్ద ఎత్తున అనుమానాలు తలెత్తుతున్నాయి.

       పెద్ద మొత్తంలో చేతులు మారాయి..?: రూ.6.50 కోట్లు విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడిన కేసులో గద్వాల ప్రాంతంలో పేరుమో సిన సీడ్‌ఆర్గనైజర్లు మధ్యవర్తిత్వం వహించినట్లు సమాచారం. నకిలీ విత్తనాలను విడిపించే క్రమంలో అక్రమాలకు సాయం చేసిన అధికారు లకు పెద్ద మొత్తంలో డబ్బులను ముట్టజెప్పినట్లు ప్రచారం బహాటంగానే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులు ఈ అవినీతిలో భాగస్వాములు అయినట్లు తెలిసిం ది. ఇంత పెద్ద మొత్తంలో నకిలీ విత్తనాలను గుట్టుచప్పుడు కాకుండా వదిలేసిన వ్యవహారంపై రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు దృష్టి సారిం చినట్లు తెలిసింది. ఇందులో భాగస్వాములుగా ఉన్నవారిపై సమాచా రాన్ని సేకరిస్తున్నట్లు సమాచారం. ఈమొత్తం గందరగోళానికి అడ్డుకట్ట పడాలంటే తక్షణమే పట్టుబడిన రూ.6.50కోట్ల నకిలీ విత్తనాల ల్యాబ్‌రి పోర్టులను బయటపెడితే కాని అసలు సంగతి తెలియదు. చూడాలి మరి అధికారుల ఎలా స్పందిస్తారో..?