Home కుమ్రం భీం ఆసిఫాబాద్ నకిలీ పత్తి విత్తనాల ముఠా అరెస్ట్

నకిలీ పత్తి విత్తనాల ముఠా అరెస్ట్

Fake Seedsకుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లా కేంద్రంలో నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్న ముఠాను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారి  నుంచి 310 విత్తన ప్యాకెట్లు, 12 కేజీల లూజ్ నకిలీ విత్తనాలు,  రూ.3342450 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్ పి మల్లారెడ్డి తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తు రైతులను మోసం చేస్తున్న ముఠాలు జిల్లాలో తిరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఇటువంటి మోసగాళ్ల  సమాచారం పోలీసులకు ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. నకిలీ విత్తనాలు సరఫరా చేసినా, నకిలీ విత్తనాలను విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వ్యవసాయ అధికారులు అప్రమత్తంగా ఉండి నకిలీ విత్తనాలు అమ్మే వారి భరతం పట్టాలని ఆయన ఆదేశించారు.

Fake Seeds Gang Arrested At Komaram Bheem Asifabad