Home ఎడిటోరియల్ భారత్‌లో బోగస్ యూనివర్శిటీలు

భారత్‌లో బోగస్ యూనివర్శిటీలు

IIPMఆ విద్యార్థి పేరు శివకృష్ణ (23) మొదటి సంవత్సరం డిగ్రీ చదువుతున్నాడు. కాలేజీ ఫీజు కట్టలేదని అందరి ముందు ఆ విద్యార్థిని మేనేజి మెంటు నిలదీసింది. ఫీజు చెల్లించకపోతే కాలేజీకి హాజరు కానవసరం లేదని మేనేజిమెంటు అందరి ముందు చివాట్లు పెట్టింది. దీంతో సగం ప్రాణం పోయింది. ఇంటికెళ్లి తన తండ్రికి ఈ విషయాన్ని చెప్పాడు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తోన్న తండ్రి చేతులెత్తేశాడు. అప్పులలో కూరుకునిపోయా. కట్టలేనని తన నిస్సహాయతను వ్యక్తం చేశాడు. దాంతో మనస్తాపానికి గురి అయ్యాడు శివకృష్ణ. ఆ రోజు రాత్రి బరువైన గుండెతో ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకున్నాడు. హైదరాబాద్ ఎల్బీ నగర్‌లోని అనుపమనగర్‌లో ఉంటోన్న ఈ కుటుంబం ఆర్థిక ఇబ్బందులలో ఉంది. అందుకే ఆ విద్యార్థి తన ప్రాణాన్ని తీసుకున్నాడు. మరో ఘటనలో తెలంగాణ కరీంనగరం జిల్లా పెద్దపల్లిలో టీనేజర్ అయిదువేల రూపాయల ఫీజును చెల్లించలేదు. వ్యవసాయదారుడైన తండ్రి తన అసక్తతను వ్యక్తం చేశారు. పాఠశాలలో మేనేజిమెంటు నిలదీయడంతో అవమానం ఎదురయ్యిందని ఆ టీనేజర్ ఎదురుగా వస్తోన్న రైలుకి ఢీకొని బలవన్మరణం పొందాడు. అత్యంత ఖరీదైన విద్యను పొందలేక, కొనుగోలు చేయలేని దుస్థితిలో ఉన్నారు భారతీయ నిరుపేద విద్యార్థులు. ప్రైవేటు చదువులు అందని ద్రాక్షపళ్లు కావడంతో ఈ రెండు సంఘటనలను చోటు చేసు కున్నాయి. ఇలాంటి దుస్సంఘటనలు అనేక రాష్ట్రాల లో కొనసాగుతున్నాయి.
నిరుపేదల మానసిక ఆందోళన
గుర్తింపు ఉన్న విద్యాసంస్థలలో పరిస్థితి ఈ విధంగా ఉంటే గుర్తింపులేని విద్యాలయాలలో విద్య లయం అవుతోంది. మరోవైపు నిరుపేద విద్యార్థులు తీవ్రంగా మానసిక ఆందోళనకు గురి అవుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విద్యాసంబంధ కారణాలతో చనిపోతోన్న వారి సంఖ్య ఆందోళన కరంగా ఉంది. నేషనల్ క్రైం బ్యూరో రిపోర్టులలో విద్యార్థులు, యువకుల ఆత్మహత్యలు నమోదు అవుతున్నాయి. రైతు మరణాల తరువాత యువత మరణాలే హెచ్చుగా ఉంటున్నాయి. లక్షలు వెచ్చించి అడ్మిషన్లు పొందుతున్నప్పటికీ ప్రయోజనం లేక పోతోందని కొందరు.. ప్రతిభావంతులైనా ఉద్యోగావ కాశాలు రాలేదని నిరాశతో బలవన్మరణాలు చేసుకుంటున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది.
21 బోగస్ యూనివర్శిటీలు
దేశంలో ప్రభుత్వ చదువులు విద్యార్థులను ఆదుకోవడం లేదు. అవసరాల కోసం ప్రైవేటు విద్యారంగాన్ని ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రతి ఏటా ఈ ప్రైవేటు విద్యారంగం అత్యంత ఖరీదైనదిగా మారుతున్నది. ఫీజులు, డొనేషన్లు ఇతర ఫీజులు కడు భారంగా తయారు కావడం వల్ల నిరుపేద విద్యార్థులు వాటిని చెల్లించుకోలేని దుస్థితిలో ఉన్నారు. విద్యే భారంగా తయారు అయిన ఈ రోజులలో బోగస్ విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయి. విద్యార్థులను వలలో వేసుకుని మోసం చేస్తున్నాయి. బోగస్ విద్యాసంస్థలలో చదువుతోన్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. యూనివర్శిటీ గ్రాంట్ల కమిషన్ (యూజీసీ) దేశవ్యాప్తంగా 21 బోగస్ యూనివర్శిటీలున్నాయని తాజాగా ప్రకటించింది. ఈ యూనివర్శిటీలకు ఎలాంటి అనుమతులు లేవని అయినప్పటికీ మేనేజి మెంట్లు వాటిని నడుపుతున్నాయని యూజీసీ పేర్కొ న్నది. ఆ యూనివర్శిటీ చదువులకు గుర్తింపు లేదని ప్రకటించింది. ఇలాంటి యూనివర్శిటీ డిగ్రీలకు గుర్తింపులు లేవని, రిక్రూట్మెంట్లకు ఈ డిగ్రీలు దోహదపడవని, పదోన్నతులకు కూడా ఉపయోగ పడవని స్పష్టం చేసింది. బోగస్ యూనివర్శిటీలు ఎక్కువగా ఉత్తరాదిన ఉన్నాయి. దక్షిణాదిన కూడా ఈ రకం యూనివర్శిటీలు పుట్టుకొస్తున్నాయి.
343 బోగస్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్స్
బోగస్ యూనివర్శిటీలే కాదు. సాంకేతిక విద్యాసంస్థలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఇంజ నీరింగ్ కాలేజీలు గానీ ఇతర రకాల టెక్నికల్ సంస్థలను ప్రారంభించాలంటే మేనేజిమెంట్లు ఏఐసీటీఈ (ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్) అనుమతి తప్పనిసరిగా పొందాలి. అలా కాకుండా పలుచోట్ల సాంకేతిక సంస్థలు వెలి శాయి. వాటికి గుర్తింపు ఉందన్న భరోసాతో విద్యా ర్థులు అడ్మిషన్లు పొందుతున్నారు. లక్షలు వెచ్చించి అడ్మిషన్లు తీసుకుంటున్నారు. రెండు నుంచి నాలుగు సంవత్సరాల డ్యూరేషన్ ఉండే చదువులు చివరకు చెల్లనివిగా నిర్ధారణ అవుతుండటంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతు న్నారు. ఫేక్ సాంకేతిక విద్యాసంస్థలు జారీ చేస్తోన్న డిగ్రీలు, డిప్లొమోలు చెల్లవు గాక చెల్లవు. ఈ చెల్లని డిగ్రీలు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాకుండా పోతు న్నాయి. ఈ కారణంగా అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు నష్టపోతున్నారు.
ఐఐపీఎంపై కేసు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ (ఐఐపీఎం) దేశవ్యాప్తంగా పలుచోట్ల ఇన్‌స్టిట్యూట్ల ను ప్రారంభించి అడ్మిషన్లు నమోదు చేసింది. కోట్లు వసూలు చేసింది. ఎంబీఏ, బీబీఏ డిగ్రీలను ఎడాపెడా జారీ చేసింది. ఈ సంస్థ చదువులు మొద ట బాగానే ఉన్నప్పటికీ తరువాత విద్య నీరు గారి పోయింది. కేవలం అమాయకులనుంచి ఏటా లక్షల కోట్లు వసూలు చేసేందుకు ఈ సంస్థలు దోహద పడ్డాయి. ఈ సంస్థకు యూజీసీ, ఎఐసీటీఈ, సీబీఎసీ సంస్థల గురింపు లేదు. ఐఐపీఎం డిగ్రీలు చెల్లవు. పలు వురు ఈ సంస్థకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు. యూజీసీ చట్టం సెక్షన్ -3, సెక్షన్ 2(1)లను ఉల్లంఘించదని కోర్టు నిర్ధారించింది. ఐపీసీ-420 కింద పోలీసులు రిజిష్టర్ చేశారు. యూజీసీ, ఈ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని, పోలీసులను, అమాయక విద్యార్థులను ఆదుకోవాలని ఆయా రాష్ట్రప్రభు త్వాలను కోరింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి స్మృతిఇరానీ రాజ్యసభ సభ్యులు అడిగిన ప్రశ్నలకు లిఖిత పూర్వక సమాధానం కూడా ఇచ్చారు. ప్రస్తుతం భారతదేశంలో విద్య అత్యంత ఖరీదైనదిగా ఉంటోంది. ప్రభుత్వ సంస్థలలో కూడా ఫీజులు హెచ్చుగా ఉంటున్నాయి. వాటిని విద్యార్థులు భరించలేక పోతు న్నారు. ప్రైవేటురంగం కూడా విద్యార్థులకు దూరంగా ఉండి పోయింది. అందని చందమామగా తయారైంది. ఇపుడు విదేశీ యూని వర్శిటీలను కేంద్రం, ఆయా రాష్ట్రప్రభుత్వాలు ఆహ్వా నిస్తు న్నాయి. విద్యాబోధన విషయంలో ప్రమాణాలుండి భారతీయ విద్యార్థులకు అందు బాటులో ఉండే విధంగా ఏ చదువు అయినా ఉండి తీరాలి. అక్రిడేషన్ కలిగి తగిన మౌలిక సదుపాయా లుండి ప్రమాణాలు పాటించే విద్యాసంస్థలను ప్రోత్స హించాలి. అలా కాక తప్పుడు డిగ్రీలు ఇచ్చే, గుర్తింపులేని సంస్థలకు ముకుతాడు వేయాలి. సంప్రదాయ విద్యాసంస్థలు కాక మారిన పరిస్థితు లకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక విజ్ఞాన సంస్థలకు మార్కెట్లో డిమాండు ఉంది. అలాంటి సంస్థలే భారతీయ విద్యార్థులకు శ్రీరామరక్ష.
దేశంలోని వివిధ రాష్ట్రాలలోని బోగస్ యూనివర్శిటీలు
బీహారు
1. మైథిలీ యూనివర్శిటీ
ఢిల్లీ
2. కమర్షియల్ యూనివర్శిటీ లిమిటెడ్
౩. యునైటెడ్ నేషన్స్ యూనివర్శిటీ
4. ఒకేషనల్ యూనివర్శిటీ
5. సెంట్రిక్ జురిడికల్ యూనివర్శిటీ
6. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
కర్నాటక
7. బదగన్వి సర్కార్ వరల్డ్ యూనివర్శిటీ
కేరళ
8. సైంట్ జాన్ యూనివర్శిటీ
మధ్యప్రదేశ్
9. కేశర్‌వానీ విద్యాపీఠ్ యూనివర్శిటీ
మహారాష్ట
10. రాజా అరబిక్ యూనివర్శిటీ
తమిళనాడు
11.డిడిబి సంస్కృతి యూనివర్శిటీ
పశ్చిమ బెంగాల్
12. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్
ఉత్తరప్రదేశ్
13. వారణాసి సంస్కృత యూనివర్శిటీ
14. మహిళా విద్యాపీఠ్
15. గాంధీ విద్యాపీఠ్
16. నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఎలెక్ట్రో కాంప్లెక్సు యూనివర్శిటీ
17. నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్శిటీ
18. యూపీ విశ్వవిద్యాలయం
19. మహారాణా విద్యాప్రతాప్ శిక్షానికేతన్
20. ఇంద్రప్రస్థ శిక్షా పరిషద్
21. గురుకుల్ విశ్వవిద్యాలయం
ఏఐసీటీఈ అనుమతిలేని ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్
(2014-12-23 తేదీ వరకు ఉన్న సమాచారం మేరకు)
1)బెల్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజి మెంటు, విశాఖ 2) సిగ్మాక్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ స్టడీస్ (ఇక్ఫాయ్), విజయవాడ 3) సిగ్మాక్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ స్టడీస్ (ఇక్ఫాయ్) విశాఖ 4)ఇండో అమెరికన్ టూరిజం లిమిటెడ్ 5) మాగ్నస్ స్కూల్ ఆఫ్ బిజినెస్, విశాఖ, 6) సన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మేనేజిమెంట్, విశాఖ, 7) వెంకట్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఏపీ.
2011-13 మధ్య ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల విద్యాస్థాయి
2011                   2012                 2013
నిరక్షరాస్యులు            19.9                  19.7                    18.5
ప్రాథమిక                    23.9                  23.0                   22.1
మిడిల్                       24.2                  23.0                    23.6
సెకండరీ                    18.9                   19.2                     20.5
హయ్యర్                    9.0                       9.7                    10.3
డిప్లొమా                     1.0                     1.5                         1.2
గ్రాడ్యుయేట్                2.5                     2.4                        3.2
పీజీ                           0.5                     0.6                         0.5
మూడేళ్లలో వివిధ కారణాలతో విద్యార్థులు, యువకుల ఆత్మహత్యల సంఖ్య
2011                     2012                       2013
దారిద్య్రం                  2282                     2291                       1886
నిరుద్యోగం               2333                         173                      2090
పరీక్షల ఫెయిల్       2381                      2246                       2471
ఉద్యోగ సంబంధ       1060                       931                         1211
(పీఐబీ, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్, ఎన్‌సీబీఆర్ నివేదిక సమాచారం ఆధారంగా)
– 9640344034