Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

2019 వరల్డ్‌కప్‌ పాక్ దే: ఫకార్‌

Fakhar Zaman Says Pak Hot Favourite of 2019 World Cup

ఇస్లామాబాద్: వచ్చే ఏడాది ఇంగ్లండ్‌  ఆతిథ్యం ఇవ్వనున్న క్రికెట్ వరల్డ్ కప్ ను పాక్ గెలవడం ఖాయమంటూ ఆ జట్టు ఓపెనర్‌ ఫకార్‌ జమాన్‌ జోస్యం చెప్పాడు. దీనికి కారణం ప్రస్తుతం తమ జట్టు సమతూకంతో ఉండడమేనని ఫకార్ పేర్కొన్నాడు. అంతేగాక ఇటీవల పాక్ టీమ్ స్థిరంగా సాధిస్తున్న విజయాలు కూడా తమ సామర్థ్యాన్ని తెలియజేస్తుందన్నాడు. ఈ టోర్నీలో మా జట్టు కచ్చితంగా హాట్ ఫేవరెట్ అని జమాన్ చెప్పుకొచ్చాడు. ఇటీవల జింబాబ్వే పర్యటనలో చెలరేగిన ఫకార్‌ ఏకంగా వన్డేల్లో డబుల్‌ సెంచరీ సాధించిన తొలి పాక్‌ క్రికెటర్‌గా అవతరించాడు. ఇప్పటి వరకు 18 వన్డేలు ఆడిన ఫకార్ 1,065 పరుగులు, 22 టీ20ల్లో 646 పరుగులు చేశాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో శతకం సాధించి పాక్ కు టైటిల్ అందించాడు. ఈ మ్యాచ్ లో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇక  ప్రస్తుతం  తన లక్ష్యం దుబాయ్ వేదికగా సెప్టెంబరు 15 నుంచి జరగనున్న ఆసియా కప్‌‌లో మెరుగ్గా రాణించడమేనని జమాన్ స్పష్టం చేశాడు. వరల్డ్ కప్‌కు చాలా సమయం ఉండటంతో ప్రస్తుతం ఉ‍న్న సిరీస్‌లపై దృష్టిసారిస్తున్నట్లు చెప్పాడు. టెస్ట్‌ క్రికెట్‌ ఓ ఆటగాడి నైపుణ్యాన్ని వెలికితీస్తుందని, ఈ ఫార్మాట్‌ లో కూడా రాణించడం తన కల అని ఫకార్ వివరించాడు.

Comments

comments