Home తాజా వార్తలు ‘ఫలక్‌నుమా దాస్’ ట్రైలర్ విడుదల

‘ఫలక్‌నుమా దాస్’ ట్రైలర్ విడుదల

వెళ్ళిపోమాకే, ఈ నగరానికి ఏమైంది లాంటి చిత్రాలలో తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు విశ్వక్ సేన్. ప్రస్తుతం విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ’ఫలక్‌నుమా దాస్’. డి. సురేష్ బాబు సమర్పణలో వన్మయి క్రియేషన్స్ బ్యానర్ పై విశ్వక్ సేన్ సినిమాస్, టెరనోవ పిక్చర్స్, మీడియా9 క్రియేటివ్ వర్క్ అనుసంధానంతో పూర్తిగా హైదరాబాద్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఈ చిత్రంలో సలోని మిశ్రా, హర్షిత గౌర్, ప్రశాంతి హీరోయిన్లుగా నటించారు. ’పెళ్లిచూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ పోలీస్ అధికారిగా కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిధిగా హాజరై సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “ట్రైలర్ చూడగానే తెలిసిపోయింది.

ఈ సినిమా మంచి హిట్ అవుతుందని. విశ్వక్ ప్రతి ఫ్రేమ్‌లోనూ అద్భుతంగా నటించారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని, ఈ టీం అందరికీ మంచి భవిష్యత్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను”అని అన్నారు. హీరో, దర్శకుడు విశ్వక్ సేన్ మాట్లాడుతూ “ట్రైలర్‌కు మంచి స్పందన వస్తున్నందుకు ఆనందంగా ఉంది. సీనియర్ స్టార్ వెంకటేష్‌ది గోల్డెన్ హ్యాండ్. ఆయన సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడంతో హ్యాపీగా ఉంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ప్రశాంతి, నిర్మాత కరాటే రాజు, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Falaknuma das movie trailer release