Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

మా వల్ల కాదు మహా ప్రభో..!

Falla en evitar satélites privados

రాములోరి సత్రాలు ప్రైవేటు నిర్వహణకు                                                                                                                దేవస్థానంలో నేడు టెండర్లు                                                                                                                                        ఎండోమెంట్‌కు చేరని సమాచారం
భక్తుల మనోభావాలకు విఘాతం                                                                                                                                రింగ్‌కు సిద్ధమైన టెండరుదారులు                                                                                                                              ప్రైవేటు సత్రాలను అరికట్టడంలో విఫలం                                                                                                                    చోద్యం చూస్తున్న అధికారులు

మన తెలంగాణ/భద్రాచలం: దక్షిణ అయోధ్య రూపురేఖల మార్పులేమో గానీ ఆలయంలో నిన్నటి వరకు కొనసాగిన సిద్ధాంతాలు పక్కదారి పడుతున్నాయి. రాముని దర్శనార్థం విచ్చేసే భక్తుల సౌకర్యార్థం దాతలు నిర్మించి ఇచ్చిన గదు లను దేవస్థానం నిర్వహణ చేయలేక ఇక మా వళ్ల కాదంటూ చేతులెత్తేస్తూ ప్రైవేటు నిర్వాహకులకు అప్పగించే యత్నాలు సాగిస్తున్నారు. భద్రాచల దేవస్థానం ఆధ్వర్యంలో నేడు టెండర్ల ప్రక్రియను నిర్వహించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. కాగా ఆదాయం సరిగా లేని రోజుల్లో నిర్వహించి కోట్లు సమకూరుతున్న సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అద్దెకు అప్పగింత: సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో 22 ఏసి కాటేజీలు, 60 ఏసి గదులు, 70 నాన్ ఏసి గదులు ఉన్నాయి. వీట న్నింటినీ దేవస్థానమే నిర్వహణ చేస్తోంది. వీటి ద్వారా వచ్చే ఆదాయం కంటే అయ్యే ఖర్చు అధికంగా ఉంది. తాజాగా ఆలయానికి ఆదాయాన్ని పెంచే క్రమం లో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. కరకట్ట క్రింది భాగంలో రామాల యం, సీతానిలయం ఉన్నాయి. సీతా నిలయంలో 36 గదులు, రామా నిల యంలో 64గదులున్నాయి. ఈ 64 గదుల రామా నిలయాన్ని అద్దె నిర్వహణకు అప్పగించేందుకు ఏర్పాటు చేశారు. ఇందు కోసం నెలకు 4 లక్షల రూపాయలు చెల్లించే వారికి టెండర్ అప్పగించాలని, లేదా అంతకంటే హెచ్చు పాటదారులు వస్తే వారికే టెండర్ ఖరారు చేయనున్నారు. అయితే పై 64 గదులకు సుమారు రూ.2లక్షలకు పైగా నెలకు ఖర్చు వస్తుండగా ఆదాయం అనుకున్న రీతిలో లే దని, అదే ప్రైవేటు వారికి అప్పగిస్తే నెలకు రూ.4లక్షలకు కాంట్రాక్టర్ నుండి కట్టించుకుంటే సంవత్సరానికి సుమారు రూ.50లక్షల వరకు ఎలాంటి ఖర్చు లేకుండా ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందని దేవస్థానం భావిస్తోన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ అద్దె నిర్ణయానికి వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఇలాంటి ప్రక్రియ ఇప్పటికే కృష్ణ జిల్లాలోని తిరుపతమ్మ దేవాలయమైన పెనుగ్రంచిపోలు, శ్రీశైలంలోని మల్లిఖార్జున స్వామి ఆలయంలో కొనసాగుతోంది. వాటి ఆధారంగా ఇక్కడ కూడా అమలు చేస్తే ఆదాయం మెండుగా వచ్చే అవకాశం ఉందని లెక్కలు వేసినట్లు పలువురు అంటున్నారు.
ఎండోమెంట్‌కు చేరని సమాచారం:- ఆలయంలో ఇంత పెద్ద ఎత్తున మార్పు జరుగుతుంటే కనీసం ఎండోమెంట్ కు ఎలాంటి సమాచారం ఇవ్వనట్లుగా తెలుస్తోంది. ప్రతీ చిన్న విషయానికి ఎండోమెంట్‌కు లేఖలు రాశాం… సమాచారం అందిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటాం అని చెప్పుకునే అధికారులు భక్తుల మనోభావాలు దెబ్బతినే వ్యవహారంలో నిర్ణయాలు తీసుకుంటూ ఎండోమెంట్‌కు ఎందుకు చెప్పడంలేదో ఆ రామదాసుకే తెలవాలి అంటూ కొందరు చర్చించుకుంటున్నారు. దీని వెనుక ఎవరి స్వార్థం దాగుంటో అంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. కానీ ఈ విషయంపై దేవస్థానం మాత్రం సర్ధి చెప్పుకుంటోంది. ప్రస్తుతం కొనసాగే నియమ నిబంధనలు, అద్దెలను ప్రైవేటు నిర్వాహకులు కూడా పాటించాలని, అందులో ఎలాంటి సందేహం లేదని, ఉల్లఘింస్తే డిపాజిట్ సొమ్ములో కత్తిరింపులు తప్పవని చెబుతున్నారు.
రింగవుతారటా:- అద్దె నిర్వహణకు సిద్దమైన పలువురు కాంట్రాక్టర్లు ఇప్పటికే రింగైనట్లు తెలుస్తోంది. దేవస్థానం ప్రైవేటు కు ఇవ్వతలపెట్టిన రామానిలయం గదులకు గానూ నెలకు రూ.4 లక్షల కోరుతుండగా, కాంట్రాక్టర్లు మాత్రం నెలకు రూ.3 లక్షలకు మించకుండా ఉండేలా షీల్టు టెండర్లు వేయాలని యోచిస్తున్నారు. ఆలయం నిర్ణయం ప్రకారం టెండర్లు రాని పక్షంలో వాయిదా వేసే అవకాశం ఉండనే ఉంది. రెండో సారి కూడా జరిగే టెండర్లలో అదే నీతిని పాటిస్తే దేవస్థానమే దిగివచ్చి ధర తగ్గిస్తుందని వారు యోచిస్తున్నట్లు సమాచారం. దీని వెనుక అంతా తానై ఉన్న ఓ అదృశ్య హస్తం ఉందనేది కొందరి అనుమానం.
అంతా విఫలం-పూర్తి చోద్యం:- నిత్యం వేలాది మంది భక్తులతో కళకళ్లాడే భద్రాద్రిలో సత్రాల నిర్వహణ కష్టంతరంగా మారడం, సరైన ఆదాయం రాకపోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. వాటిని అన్వే షించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అధికారులు విఫలం కావడం, చోద్యం చూస్తుండటంతో ఆలయాదాయానికి గండి పడుతోంది. భద్రాచలం కేం ద్రంలో ఇబ్బడి ముబ్బడిగా లాడ్డీలు ఉన్నాయి. ఇవే కాకుండా రామాల యం పరిసర ప్రాంతాల్లో ప్రతీ చిన్న ఇంటిలో కూడా అనుమతలు లేకుం డా పెద్ద ఎత్తున అద్దె గదులు నడుపుతున్నారు. వీటి నిర్వాహకులు ఆటో వాలాలను, బ్రోకర్లును ఆకట్టుకుని కమిషన్లు ఇస్తూ భక్తులను వారి వైపుకు తిప్పుకుంట్టుకోవడంతో సత్రాలు నిండటం లేదు. వీటిని అరికట్టేందుకు పలు శాఖలను కలుపుకుని చర్యలు చేపట్టాల్సిన రామాలయం నిర్వాహ కులు అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో ప్రైవేటు భాగోతం తప్ప దని, రాబోయో రోజుల్లో రాముల వారి పూజలు, ఇతరత్రా కైంకర్యాలు, శ్రీరామ నవమి, ముక్కోటి వంటి పర్వదినాల నిర్వహణ కూడా ప్రైవేటు వ్యక్తుల చేతులకు అప్పగిస్తారేమో అంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు.

Comments

comments