Home తాజా వార్తలు ఎన్‌టిఆర్‌కు ఘన నివాళులు

ఎన్‌టిఆర్‌కు ఘన నివాళులు

Sr-NTRహైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, నటుడు నందమూరి తారక రామారావు 21వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఎన్‌టిఆర్ సమాధి వద్ద హరికృష్ణ, జూనియర్ ఎన్‌టిఆర్, కళ్యాణ్ రామ్, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మణి మాట్లాడుతూ.. రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక రోజుల్లో రక్తదానం చేయాలన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తం ఇచ్చి ఆదుకోవాలని తెలిపారు.

రసూల్‌పూరాలో ఎన్‌టిఆర్ విగ్రహం వద్ద హీరో బాలకృష్ణ నివాళులర్పించారు. అమరజ్యోతి ర్యాలీని ఎంఎల్‌ఎ బాలకృష్ణ ప్రారంభించారు. నెక్లెస్ రోడ్డు మీదుగా ఎన్‌టిఆర్ ఘాట వద్దకు ఈ ర్యాలీ కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్‌టిఆర్ వ్యక్తి కాదని, ఓ శక్తి అని అన్నారు. పేదల కోసం సంక్షేమ పథకాలు తెచ్చిన ఆధ్యుడు ఎన్‌టిఆర్ అని కొనియాడారు. ఎన్‌టిఆర్ అంటే గుర్తుకొచ్చేవి ఉద్యమం, ఆవేశం, పట్టుదల, కృషి, క్రమశిక్షణ అని స్పష్టం చేశారు. పలువురు ప్రముఖులు, టిటిడిపి నేతలు ఎన్‌టిఆర్‌కు నివాళులర్పించారు.