Home కామారెడ్డి రోడ్డు ప్రమాదం.. తల్లి అంత్యక్రియలు… కుమారుడి పరిస్థితి విషమం

రోడ్డు ప్రమాదం.. తల్లి అంత్యక్రియలు… కుమారుడి పరిస్థితి విషమం

గోపాల్‌పేటలో విషాదఛాయలు…
హైదరాబాద్ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు
తల్లి తాహేరా బేగం ముఖం ఆఖరి చూపుకు నోచుకోని ధీనత్వం

 

మన తెలంగాణ/నాగిరెడ్డిపేట: కామారెడ్డి జిల్లా  నాగిరెడ్డిపేట మండలం గోపాల్‌పేట గ్రామానికి చెందిన కుటుంబానికి రాజంపేట మండలం బస్వన్నపల్లి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎం.ఎ.ఖలీల్‌తో పాటు తన ఇద్దరి కుమారులకు, కుమార్తెకు తీవ్ర గాయలవ్వడమేకాకుండా తల్లి మృతి చెందడంతో గోపాల్‌పేట్‌లో విషాదఛాయలు నెలకొన్నాయి. ఖలీల్ కుటుంబం అన్ని వర్గాల వారితో సన్నిహితంగా, స్నేహపూర్వక సంబంధాలతో జీవించేవారు కావడంతో ఖలీల్ ఇంటి వద్ద శుక్రవారం అన్ని కులాల, వర్గాల వారు ఇంటి వద్ద శోకసంద్రంలో మునిగిపోయారు. మృతి చెందిన ఖలీల్ తన తల్లి తాహేరా బేగం మృతదేహాన్ని చూస్తూ కన్నీరుమున్నీరయ్యారు. ఖలీల్‌కు స్వయంగా పిత్తాశయం పగిలిపోవడం వల్ల హైదరాబాద్ ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగిందని, ప్రస్తుతం ఆయన ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారని, అలాగే ఖలీల్ కుమార్తె హస్రా (11), కుమారులు షాదన్ (8), అయాన్ (4)లకు కూడా తీవ్రగాయాలు కావడం వల్ల చికిత్స పొందుతున్నారు.

కుమార్తెకు, చిన్న కుమారుని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పిల్లలు, ఖలీల్ వద్ద ఖలీల్ భార్య సమీనా వారి దగ్గరి బంధువులు ఉన్నారు. మృతి చెందిన ఖలీల్ తల్లిని శుక్రవారం ఉదయం కామారెడ్డి ఆసుపత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహించి మృతదేహాన్ని, ఇంటికి తీసుకువచ్చారు. తల్లి అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం నమాజ్ సమయంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఎక్కడి వారు అక్కడ తల్లి అంత్యక్రియలు చూడలేని పరిస్థితిలో తీవ్రగాయాలతో పాటు పిత్తాశయం పగిలిపోయి ఆపరేషన్ జరిగి ఎమర్జెన్సీ వార్డులో ఉండగా, చిన్న కుమార్తె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అతని భార్య, దగ్గరి బంధువులు కూడా హైదరాబాద్‌లో ఉండి మృతి చెందిన తల్లి ముఖం ఆఖరిచూపుకు నోచుకోలేని పరిస్థితి ఖలీల్‌కు, అతని భార్యకు మిగిలింది. కుటుంబాన్ని నడిపించే బాధ్యత గల వ్యక్తి ఖలీల్ కావడంతో అతనికి ఆపరేషన్ జరిగి ఎమర్జెన్సీలో ఉన్నందున తల్లి మరణం ఆయనకు తెలియకుండా ఖలీల్ తమ్ముడు, మృతురాలి చిన్నకుమారుడు హుమాయున్ సంఘీర్, అతని భార్య షహీన్ ఇరువురు మాత్రమే ఇంటి వద్ద ఉండి కార్యక్రమాలు నడిపించారు. ఒకపక్క మృతి చెందిన తల్లి అంత్యక్రియలు, మరోపక్క పిల్లలు హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందడం, ఖలీల్ ఆసుపత్రిలో చికిత్స పొందడం ఎవరికి ఎవరు చూడలేని పరిస్థితి నెలకొనడంతో బంధువులకు సైతం ఏమీ తోచని పరిస్థితి నెలకొన్నది.

అంత్యక్రియల్లో పాల్గొన్న బిత్తిరి సత్తి…

రాజంపేట మండలం బస్వన్నపల్లి వద్ద ప్రమాదంలో మృతి చెందిన తాహేరా బేగం అంత్యక్రియలకు టివి నటుడు బిత్తిరి సత్తి హాజరయ్యారు. తాహేరా బేగం చిన్న కుమారుడు హుమాయున్ సంఘీర్ చిన్నచిన్న సీరియళ్ళలో నటిస్తుంటాడు. వీరిద్దరు చిన్ననాటి మిత్రులు కాగా శుక్రవారం నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్‌పేటలో జరిగిన అంత్యక్రియల్లో పాల్గొని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

 

Family Suffer in Road Accident in Kamareddy