Home జోగులాంబ గద్వాల్ విద్యావేత్త ఆరోన్ రాస్ సతీమణి కన్నుమూత

విద్యావేత్త ఆరోన్ రాస్ సతీమణి కన్నుమూత

Ross

జోగులాంబ గద్వాల: ప్రముఖ విద్యావేత్తగా జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలకు సుపరిచితులైన భూంపాల్ ఆరోన్‌రాస్ సతీమణి శారా రాస్ (80) ఆదివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె గద్వాల మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యురాలిగా కొన్నేళ్ల పాటు సేవలు అందించారు. ఆమెకు ఐదుగురు కుమారులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఆమె కుమారుడు జేకబ్ రాస్ తెలంగాణ సిఎం కార్యాలయ పిఆర్‌ఒగా పని చేస్తున్నారు. ఆమె మృతిపై జడ్‌పి చైర్మన్ బండారి భాస్కర్, గద్వాల ఎంఎల్‌ఎ డికె అరుణ, స్థానిక రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. 50 ఏళ్ల నుంచి పాఠశాలలు, నర్సింగ్ కళాశాలలు నిర్వహించి పాలమూరులోని పేద విద్యార్థులకు విద్యా దానం చేశారు. సోమవారం ఆమె అంత్యక్రియలు గద్వాలలోని మిషన్ కాంపౌండ్ లో జరగనున్నాయి.

Famous Academist Aaron Ross’s wife Died !