Home జాతీయ వార్తలు ప్రముఖ కమెడియన్ కన్నుమూత

ప్రముఖ కమెడియన్ కన్నుమూత

Famous Comedian Kavi Kumar Azad Passes Away

ముంబయి : ప్రముఖ కమెడియన్, టివి నటుడు కవి కుమార్ ఆజాద్ సోమవారం గుండెపోటుతో కన్నుమూశారు. తారక్ మెహతా కా ఉల్టా చష్మా షోలో డాక్టర్ హన్స్‌రాజ్ హాతి క్యారెక్టర్‌తో ఆయన ప్రసిద్ధి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కవి కుమార్‌ను వోక్‌హార్ట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తీవ్రమైన గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచాడు. కవి కుమార్ మృతిపై పలువురు బాలీవుడ్ నటులు, టివి నటులు సంతాపం తెలిపారు.

Famous Comedian  Kavi Kumar Azad Passes Away