Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

ఆంగ్ల సాహిత్యంలో దిట్టలు..

William-Shakespeare

17వ శతాబ్దంలో ఆంగ్ల భాష ప్రపంచమంతటా వ్యాపించింది. 16 వ శతాబ్దంలో మోడ్రన్ ఇంగ్లీషు ప్రారంభమైంది. ఆంగ్ల సాహిత్యంలో అనేక మంది కవులు, నాటక రచయితలు తరువాతి తరం వారికి మార్గదర్శకులుగా నిలిచారు.
-జఫరీ సాజర్: 13, 14 శతాబ్దాల మధ్యలో ఆంగ్ల కవిత్వాన్ని పరిచయం చేసినవారు జఫరీ సాజర్.
-విలియం షేక్స్‌పియర్: ఏజ్ యు లైక్‌ఇట్, జూలియస్ సీజర్, రోమియో అండ్ జూలియట్, ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్, హామ్లెట్, మేక్బత్‌లాంటి నాటకాల్ని రచించాడు. స్వయంగా నటుడు.
-చార్లెస్ డికెన్స్: (1812-1870) ప్రసిద్ధి గాంచిన ఆంగ్ల నవలా రచయిత.సామాజికి కార్యకర్త. పారిశ్రామిక విప్లవం అభివృద్ధి చెందుతున్న రోజుల్లో ఈయన మొదటి తరం రచయిత. డేవిడ్ కాపర్‌ఫీల్డ్, గ్రేట్ ఎక్స్‌పెక్టేషన్స్‌లాంటి గొప్ప నవలలు రాశాడు.
-జాన్ కీట్స్: ( 1795- 1821) ఆంగ్ల సాహిత్యంలో కాల్పనిక సాహిత్యంలో ప్రముఖులు. అందరికంటే చిన్నవాడు జాన్ కీట్స్. తన 25 ఏళ్ల వయసులో టిబితో దివంగతుడైనాడు.
-విలియం వర్డ్‌వర్త్: సుప్రసిద్ధ ఆంగ్ల కవి. (1770-1850) యాన్ ఈవినింగ్ వాక్‌లాంటి కవిత్వాల ద్వారా వాడుక భాషలో రాసి ప్రసిద్ధి చెందాడు.
-జాన్ మిల్టన్: (1608-1674) పారడైజ్‌లాస్ట్‌లాంటి కవిత్వాన్ని అందించాడు.

Comments

comments