Home తాజా వార్తలు ప్రముఖ టాలీవుడ్ గాయని కన్నుమూత

ప్రముఖ టాలీవుడ్ గాయని కన్నుమూత

Famous Tollywood Singer Rani Passed Away

హైదరాబాద్ : ప్రముఖ టాలీవుడ్ గాయని కె.రాణి (75) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. హైదరాబాద్‌లోని కల్యాణ్‌నగర్‌లో ఉన్న తన పెద్ద కుమార్తె విజయ నివాసంలో ఆమె మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దేవదాస్ చిత్రంలోని ‘ అంతా భ్రాంతియేనా … జీవితానా వెలుగింతేనా ’ అనే పాటతో ఆమె ప్రసిద్ధి గాంచారు. తెలుగులో సుమారు ఐదు వందల పాటలను ఆమె పాడారు. శ్రీలంక జాతీయ గీతాన్ని కూడా ఆమె ఆలపించారు. నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణని తన గానామృతంంతో ఆకట్టుకుంది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ,బెంగాలీ, సిన్హలా, ఉజ్జెక్ తదితర భాషల్లో ఆమె పాటలు పాడారు. రూపవతి అనే తెలుగు చిత్రంతో తన కెరీర్‌ను మొదలు పెట్టారు. బాటసారి, జయసింహ, ధర్మదేవత, లవకుశ తదితర చిత్రాలు ఆమె కెరీరర్‌లో చెప్పుకోతగ్గ చిత్రాలుగా నిలిశాయి. గాయని రాణి మృతిపై తెలుగు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Famous Tollywood Singer Rani Passed Away