ఎన్టీఆర్ నెక్స్ సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ కూడా అభిమానుల ఆకాంక్ష మేరకు త్వరగా ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ఆయన చేస్తున్న ‘అరవింద సమేత…’ చిత్రాన్ని చాలా వేగంగా పూర్తిచేస్తున్నాడు. కొన్ని వారాల కిందట ప్రారంభమైన ఈ సినిమా అప్పుడే సగం షూటింగ్ పూర్తి చేసుకుంది. చిత్రీకరణకు సంబంధించిన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇక సినిమా నెక్స్ షెడ్యూల్ కోసం త్రివిక్రమ్ వరంగల్‌లో మకాం వేశాడు. కథలోని కొన్ని కీలకమైన సన్నివేశాలను తెలంగాణ వాతావరణానికి తగ్గట్టు తెరకెక్కించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంది. అందులో భాగంగానే దర్శకుడు త్రివిక్రమ్ వరంగల్‌లోని పలు ప్రదేశాలను సందర్శించడం జరిగింది. అలాగే ప్రసిద్ధ భద్రకాళి దేవాలయాన్ని కూడా చూశాడట. ఈ షెడ్యూల్లో యాక్షన్ సీన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేసి దసరా పండుగకు సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. ఇక ప్రస్తుతం కొంచెం గ్యాప్ దొరకడంతో తారక్ తన ఫ్యామిలీతో సమయాన్ని గడుపుతున్నాడు. తాజాగా తన చిన్న కొడుకుకు భార్గవ రామ్ అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఇక ‘అరవింద సమేత…’ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే నటిస్తుండగా జగపతిబాబు, నాగబాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.