Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

సెరెనా స్విమ్ సూట్ ఫోటోపై అభిమానుల కన్నెర్రా!

Serena-Williams-Swim-shootన్యూయార్క్: ఒక్క స్టాగ్రామ్‌లోనే 31 లక్షల మంది ఫాలోవర్లు కలిగిన స్టార్ ప్లేయర్ సెరెనా విలియమ్స్. ఇక ఫేస్ బుక్, ట్విట్టర్‌లను కలుపుకొంటే అక్షరాల 87 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. గ్రాండ్ స్లామ్‌లతోపాటు నెటిజన్ల అభిమానాన్ని కూడా చూరగొన్న ఈ నల్ల కలువకు ‘సోషల్ మీడియా చాంపియన్’ అని అవార్డులు కూడా వచ్చాయి. అలా సెరెనాను విపరీతంగా ఆరాధించే ఫ్యాన్స్ ఇటీవల ఆమె స్విమ్ సూట్ ధరించిన ఫోటో విషయంలో మాత్రం తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మోస్ట్ బ్యూటిఫుల్ ఉమన్ ఆఫ్ 2016’ శీర్షికతో ప్రఖ్యాత పీపుల్స్ మాగజైన్ ఓ సంచికను రూపొందిస్తోంది. అందులో భాగంగా 34 ఏళ్ల సెరీనా విలియమ్స్ హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోషూట్ విశేషాలను అభిమానులకు తెలియజేస్తూ నల్లని స్విమ్ సూట్ ధరించిన ఫోటో ఒకటి సెరెనా ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. క్షణాల్లోనే లక్షల మందికి చేరిపోయిందీ ఫోటో. అంతే, సెరెనా చర్యకు అభిమానులు నొచ్చుకున్నారు. ఇంతకీ ఆమె చేసిన పొరపాటు ఏమిటంటే.. సెరీనా పోస్ట్ చేసిన ఫోటోలో ఆమె నడుము భాగం ఉన్నది ఉన్నట్లుగా కాకుండా, సన్నగా(ఫోటోషాప్‌తో ఎడిట్ చేసి) కనిపించింది. అభిమాన క్రీడాకారిణి ఎలా ఉంటుందో తెలుసుకాబట్టి ఆ ఫోటో చూసి విస్తుపోయారు ఫ్యాన్స్! ఎందుకిలా ఫోటోషాప్‌లో మార్పులు చేసిన ఫోటోను పోస్ట్ చేశావ్? అంటూ నిమిషాల వ్యవధిలోనే వందలమంది అభిమానులు సెరెనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేశారు. దీంతో కంగుతిన్న సెరెనా.. రెండు గంటల్లోపే మొదటి ఫోటోను తీసివేసి, ఒరిజినల్ ఫోటోను పోస్ట్ చేశారు. అయితే రెండో ఫోటోపైనా కూడా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

Comments

comments