Search
Wednesday 14 November 2018
  • :
  • :

భళా.. పెన్సిల్ కళ..

lfe

మనం నిత్యం చూసే వ్యక్తుల చిత్రాలను పెన్సిల్‌తో గీయడమంటే అంత సామాన్యమైన విషయమేమీ కాదు. కొద్దిగా తేడా వచ్చినా తెలిసిపోతుంది. ఇక్కడున్న చిత్రాలు అన్నీ కంప్యూటర్‌తో వేసినవి కావు ఒక చిన్న పెన్సిల్ ముక్కతో గీసిన అద్భుతమైన చిత్రాలు. మనం చూస్తున్నది ప్రాణం ఉన్న మనుషులుగా అనిపించేలా.. ఆశ్చర్యపడేలా చేస్తున్నాడు ఈ పెన్సిల్ స్కెచ్ కళాకారుడు కందుకూరి జగన్. అమ్మనాన్న కందుకూరి చెంగయ్య ఆచారి, లక్ష్మీ సరస్వతి. నాన్న బంగారు ఆభరణాల డిజైన్లు తయారు చేయడంలో గొప్ప కళాకారుడు. చిన్నప్పటి నుంచి నాన్నను చూస్తూ పెరిగిన జగదీష్‌కి కూడా వీటిపై మరింత ఆసక్తి పెరిగింది. స్కూలో చదువుకంటే బొమ్మలు వేయడంలో ఆసక్తి ఎక్కువ చూపించేవాడు. హైదరాబాద్‌లో మల్టీమీడియా గ్రాఫిక్స్ డిజైనర్‌గా చదువుకున్నాడు. రోజు తండ్రి తయారుచేసే బంగారు ఆభరణాల డిజైన్లు చూసి తాను కూడా గొప్ప కళకారుడవ్వాలని అనుకునేవాడు. రంగులతో కాకుండా పెన్సిల్ తో వేస్తే ఆ రూపానికి ప్రత్యేకత ఉంటుందని జగదీష్ ఉద్దేశ్యం. జగన్ వేసిన చిత్రాల్లో ఎక్కువ శాతం సినీ రంగానికి చెందిన వారు ఉంటారు. జగన్ గీసిన చిత్రాల్లో పోలికలే కాదు .. కళ్లలో కనిపించే నీడ సైతం అచ్చుగుద్దినట్లుగా అత్యంత సహజంగా కనిపిస్తాయి. సోషల్ మీడియాలో జగన్ రియల్ హీరో. తన ప్రతిభకు మంచి గుర్తింపు రావడమే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాల వారి నుంచి కూడా మంచి గుర్తింపు లభించింది. జగన్ వేసిన బహుబాలిలో ప్రభాస్ చిత్రం గీయడంతో ఆ ఆర్ట్‌ని చూసిన సినీ దర్శకుడు రాజమౌళి తన యూనిట్‌లో పనిచేయమని చెప్పడంతో ఆ క్షణం మరిచిపోలేని సంఘటనగా ఇప్పటికి గుర్తుపెట్టుకున్నాడు.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అంటే చాలా ఇష్టం. తెలంగాణని నెంబర్‌వన్‌గా తయారు చేసిన వ్యక్తి. తండ్రి బాటలో నడుస్తు మంత్రి కెటిఆర్ కూడా ప్రజల్లో ఐటి రంగంలో మంచి గుర్తింపు తెస్తున్నారు వారంటే నాకు చాలా చాలా ఇష్టం అంటున్నాడీ కళాకారుడు. అందుకే ముఖ్యమంత్రి ఫొటోని పెన్సిల్‌తో వేశాడు. ప్రస్తుతం తెలంగాణ కళ ఉట్టిపడేలా బోనాలు, హరితహారం, మిషన్ కాకతీయ వంటి టి చిత్రాలు వేయడం మొదలుపెట్టాడు. కెటిఆర్ చిత్రాన్ని తయారు చేసిన తరువాత ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి బహుమతిగా ఇస్తానంటున్నాడు జగన్. ఇప్పటితరం వారికి చిత్రకళపై అవగాహన కరువైంది. ఎక్కువ శాతం పేపర్‌పై కాకుండా కంప్యూటర్‌లో బొమ్మలు వేస్తున్నారని చెబుతున్నాడు. చిత్రాలు వేయాలని ఇష్టం ఉన్న పేద పిల్లలకు ఉచితంగా శిక్షణ ఇస్తుంటాడు. పర్యావరణానికి హాని కలిగించే రసాయనాలు వాడకుండా కేవలం పెన్సిల్‌తో చిత్రాలు వేయడం అంటే తనకు చాలా ఇష్టం అంటున్నాడు.

విష్ణు కాసోజు

Comments

comments