Home జాతీయ వార్తలు పట్టాలు తప్పిన ఫరక్కా

పట్టాలు తప్పిన ఫరక్కా

India most modern rail factory in Raebareli of U.P

Farakka train accident in RaeBareli

రాయ్‌బరేలీ వద్ద రైలు ప్రమాదం: ఏడుగురు దురరణం

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో బుధవారం ఘోర రైలు ప్రమాదం సంభవించింది.   న్యూ ఫరక్కా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన  తొమ్మిది బోగీలు పట్టాలు తప్పడంతో  ఏడుగురు ప్రయాణికులు మృతి చెందారు. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా నుం చి న్యూఢిల్లీకి వెళ్తుండగా హరిచంద్‌పూర్ వద్ద  ఘటన చోటు చేసుకుందని  శాంతి, భద్రతల అడిషనల్ డైరెక్టర్ జనరల్(ఎడిజి) ఆనంద్ కుమార్ తెలిపారు. 35 మంది వరకు  గాయ పడ్డారన్నారు. గాయపడిన వారిలో 10మంది మహిళలు, ఆరుగురు మైనర్లు ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నలుగురి పరిస్థితి విషమంగా  ఉండడంతో  లక్నోలోని కింగ్ జార్జ్ ఆస్పత్రికి తరలించినట్లు ప్రభుత్వ అధికార  ప్రతినిధి శ్రీకాంత్ శర్మ తెలిపారు. ప్రయాణికులకు భోజన వసతి ఏర్పాటు చేశామని, బస్సుల ద్వారా వారిని లక్నోకు తరలించినట్లు తెలిపారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు  లక్నో నుంచి ప్రత్యేక రైలులో ఢిల్లీకి పంపామని శర్మ తెలిపారు. రైలు ప్రమాద మృతులకు ప్రధాని నరేంద్ర మోడీ  తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.  మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, గాయపడిన వారికి లక్ష రూ పాయల చొప్పున, స్వల్ప గాయాలైన వారికి రూ.50 వేల చొప్పున  పరిహారం ఇవ్వనున్నట్లు రైల్వే శాఖ మంత్రి  పీయూష్ గోయల్ తెలిపారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  కూడా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున  పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై  విచారణకు ఆదేశించినట్లు రైల్వేశాఖ మంత్రి తెలిపారు.