Home జయశంకర్ భూపాలపల్లి రైతు ఆత్మహత్యలన్నీప్రభుత్వ హత్యలే: గండ్ర

రైతు ఆత్మహత్యలన్నీప్రభుత్వ హత్యలే: గండ్ర

gndra

చిట్యాల: రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని మాజీ చిఫ్ విప్ గండ్ర వెంకటరమణరెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మం డల అధ్యక్షులు గొర్రె సాగర్ ఆధ్వర్యంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏర్పాటుచేసిన ధర్నాలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అకాలవర్షంతో రైతులు విలవిలలాడినా కనీసం ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలులేవని అన్నారు. రాష్ట్రంలో నిరంకుశపాలన నడుస్తుందన్నారు. పత్తి, ఇతర పంటలకు రైతులకు ఎకరాకు రూ.20,000వేలు చెల్లించి, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఎద్దు ఏడ్చిన వ్యవసాయం … రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు.
రాష్ట్రంలో రైతులను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం చరిత్రలో ఏ రోజు బాగు పడినట్లు లేదన్నారు. 2019లో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రానున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రూ.2లక్షలు ఏకకాలంలో రూణమాఫీ చేస్తామని హామీనిచ్చారు. జిల్లా, మండల నాయకులు దొమ్మటి సాంబయ్య, పెరుమాండ్ల రవీందర్, కోటగిరి సతీష్, ఆడెపు సంపత్, సట్ల రవీందర్, కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.