Home తాజా వార్తలు ‘రైతుబంధు’ కార్యక్రమంలో అపశృతి!

‘రైతుబంధు’ కార్యక్రమంలో అపశృతి!

Farmer Attempt Suicide at Rythu Bandhu Scheme's Cheque distribution Event

రాజన్న సిరిసిల్లా: రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు పథకానికి సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసిందే. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతుకుంట మండల కేంద్రంలో మంత్రి కెటిఆర్ రైతుబంధు చెక్కులను పంపిణీ చేస్తున్న సమయంలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన అక్కడి వారు వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నం చేసిన రైతును ఓగులాపూర్‌కి చెందిన ఇల్లందుల కిష్టయ్యగా గుర్తించారు. కాగా, ఇటీవల సర్కార్ దళితులకు మూడెకరాల భూమి ఇచ్చిందని, కానీ దళితుడైన తనకు భూమి ఇవ్వలేదని మనస్తాపంతో అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం.