Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

రైతుకు జాక్ పాట్..!

Farmer buy Ongole cattle for low price and sold for Highest price: AP

అమరావతి: ఎపిలోని ఓ రైతుకు జాక్ పాట్ తగిలింది. రూ. 90వేలు పెట్టి కొన్న ఒంగోలు గిత్త ఏడాదిన్నర తర్వాత రూ. 5.25 లక్షలకు అమ్ముడుపోయింది. దీంతో ఆ రైతుకు ఏకంగా రూ.4.35 లక్షల లాభం వచ్చింది. వివరాల్లోకి వెళితే… కర్నూలులోని చాగలమర్రి గ్రామంలో ఉండే అలంసాగారి మౌలాలి అనే రైతు 18 నెలల క్రితం రూ.90 వేలకు ఓ ఒంగోలు గిత్తను కొన్నాడు. అయితే, దాన్ని బుధవారం రూ.5.25 లక్షలకు విక్రయించాడు. కడప జిల్లా మైదుకూరు మండలం మల్లయ్యపల్లి గ్రామానికి చెందిన గోవిందరెడ్డి అనే రైతు ఈ భారీ మొత్తానికి కొనుగోలు చేశాడు. ఈ ఒంగోలు గిత్త రాష్ట్రస్థాయిలో బండలాగుడు రేసులో మూడుసార్లు మొదటి స్థానంలో, రెండుసార్లు ద్వితీయ స్థానాల్లో గెలిచి పలువురి మన్ననలు పొందింది. దీంతో ఈ గిత్తకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే రైతుకు ఆ గిత్త భారీ లాభాన్ని తెచ్చిపెట్టింది.

Comments

comments