Home తాజా వార్తలు నగరం నడిబొడ్డున రైతు ఆత్మహత్య

నగరం నడిబొడ్డున రైతు ఆత్మహత్య

1234

హైదరాబాద్: బేగంపేటలోని బాలమ్‌రాయ్ పంప్ హౌజ్ వద్ద చెట్టుకు రైతు మల్లేష్ ఉరివేసుకున్నాడు. మల్లేష్ మృత దేహాన్ని పోలీసులు గాంధీ ఆస్పత్రి శవాగారానికి తరలించారు. అప్పుల బాధ తాళలేక రైతు మల్లేష్ ఆత్మహత్య చేసుకున్నారు. తనకున్న రెండు ఎకరాల్లో మొక్కజోన్న, పత్తి సాగుచేసినట్లు మల్లేష్ కొడుకు చెప్పాడు. ఉపాధి కోసం మెదక్ జిల్లా దౌల్తా బాద్ మండలం రాంసాగర్ నుండి మల్లేష్ హైదరాబాద్‌కు వలస వచ్చాడు. వారం రోజుల క్రితం మల్లేష్ హైదరాబాద్‌కు వచ్చి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు.