Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న రైతు అబ్దుల్ గఫార్

ఐదు ఎకరాల్లో పత్తి, క్యారెట్ వేసిన చేతికి రాని పంట

farmer2రంగారెడ్డి: అప్పులు బాధతో అన్నదాత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన షాబాద్ మండల పరిధిలోని తిర్మలాపురం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు కథనం ప్రకారం షాబాద్ మండల పరిధిలోని తిర్మలాపురం గ్రామానికి చెందిన రైతు అబ్దుల్ గఫార్ (50) రెండు ఎకరాల పొలం ఉంది. దీనికి తోడు మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని అందులో పత్తి, క్యారెట్ పంటలు సాగు చేశాడు. పొలంలో ఒక బొరును కూడా వేయించాడు. తన కూతురికి వివాహం చేశాడు దీనికి తోడు ఈ సారి తీవ్ర వర్షాబావ పరిస్థితుల కారణంగా పంట చేతికి అందలేదు. దీంతో పంటకోసం సుమారుగా రెండు లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో ఎలా తీర్చాలో తెలియక శుక్రవారం ఉదయం తన పొలంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘోరున విలపించారు. కుటుంబాన్ని పోషించేవాడే ఆత్మహత్య చేసుకుంటే ఎలా బ్రతకాలని కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుని కుమారుడు అక్బర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీధర్‌రెడ్డి తెలిపారు.

farmer3

Comments

comments