Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

అప్పుల బాధలతోనే ఆత్మహత్యలు

రైతులకు సహకరించని బ్యాంకులు, అధికారులు
జెఎసి చైర్మన్ ప్రొ. కోదండరామ్

Kodanda-ram

మంచాల: అప్పుల బాధలతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని జెఎసి చైర్మన్ ప్రొ. కోదండరామ్ అన్నారు. రైతులకు ఇ టు బ్యాంకులు, అటు అధికారులు సహకరించ డం లేదన్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండ ల పరిధిలోని రంగాపూర్ గ్రామంలో ఇటీవల ఆ త్మహత్య చేసుకున్న రైతు దంపతుల కుటుంబాన్ని ఆయన పరామర్శించి, వారి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ బోర్లు వేసి అప్పుల ఊబిలో చిక్కు ని ఆత్మహత్య చేసుకున్న పెండ్యాల మెహనాచారి, సరిత చావును చూసైనా ప్రభుత్వం స్పందించాల ని, ఇబ్రహీంపట్నం చెరువులో నీటిని నింపాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ప్రభుత్వం వ్య వసాయరంగంపై తీసుకునే నిర్ణయాలు రైతులపై భారంగా మారుతున్నాయని ఆరోపించారు. రైతు దంపతుల అప్పులను పూర్తిగా మాఫీ చేసి వారి తాకట్టు పత్రాలను వారి బంధువులకు అప్పగిం చాలన్నారు. ఆయన వెంట జెఎసి జిల్లా చైర్మన్ వేదిరే చల్మారెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ రాములు, సి పిఐ రాష్ట్ర నాయకులు కావలి నర్సింహ, నాయ కులు తదితరులు పాల్గొన్నారు.

రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి..

అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు దం పతుల కుటుంబానికి అప్పులు మాఫీ చేయడంతో పాటు రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం మంచాల తహసీల్దా ర్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ అధ్వర్యం లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పా ర్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడు తూ రైతులను గాలికొదిలి కార్పొరేట్ సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెడ్ కారెట్ పరుస్తు న్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వా త రాష్ట్రంలో 380 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. అనంతరం మంచా ల తహసీల్దార్‌కు వినతి పత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కె భూ పాల్, జిలా ్లకోర్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments