Home ఆదిలాబాద్ అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Farmer committed suicide with financial problems

ఆదిలాబాద్: మండలంలోని టాక్లీ గ్రామానికి చెందిన గంగాధర్ (50) అనే రైతు శనివారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మృతుడు గంగాధర్ రోజువారీగా పంట పోలాలకు వెళ్లారు. పండించిన పంట అనుకునంతగా దిగుబడి రాకపోవడంతో పంటల కోసం చేసిన అప్పులు తీర్చేది ఎలా అని మనస్థాపానికి గురై తన పంట పోలంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిపారు. మృతునికి భార్య, ముగ్గురు కూమర్తెలు, ఒక కొడుకు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ మహేష్ తెలియజేశారు.