Home తాజా వార్తలు భూ వివాదాలతో రైతు ఆత్మహత్య..

భూ వివాదాలతో రైతు ఆత్మహత్య..

Farmer committed suicide with land problems in medchal

మేడ్చల్: భూ వివాదాలతో మనస్తాపానికి గురైన రైతు తన వ్యవసాయ పొలంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం మండల పరిధిలోని చీర్యాల్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చీర్యాల్ గ్రామానికి చెందిన రైతు కోల నర్సింహ్మ (48) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నర్సింహ్మకు గత కొంత కాలంగా తన వ్యవసాయ పొలం సమీపంలోని రైతులతో భూ వివాదాలు ఉన్నాయి. ఈ విషయంపై పలు సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేకపోవడంతో ఆయన కోర్డుకు సైతం వెళ్లాడు. కాగా.. గత మూడు రోజుల క్రితం భూమి విషయంలో గొడవలు జరుగగా తీవ్ర మనస్థాపానికి గురైన నర్సింహ్మ బుధవారం తన వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతునికి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.