Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

Farmer Dies In Suspected In Vikarabad District

ధారూర్: వృత్తి రీత్యా వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న నిరు పేద రైతు అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంఘటనధారూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా లోని కొట్లగుంట తాండ (గెరిగేట్ పల్లి ) కి చెందిన కోలావత్ నీలిబాయ్ భర్త కొలావత్ సూర్య వయస్సు 34 సంవత్సరాలు వృత్తి రీత్య వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడిపేవాడు. తేది 15-7-18 రోజున ఉదయం 10 గంటల సమయంలో తమ పొలానికి చదును చేయడానికి భర్తతో కలిసి వెళ్లి తమ పొలంలో సాయంత్రం వరకు పనులు చేసినామని ఆమె చెప్పారు.  అనంతరం సాయం కాలానికి  తన భర్త పక్కనే ఉన్నటు వంటి మున్నూరు సోమారం చెరువులో చేపలు పట్టుకు వస్తానని , అలాగే  తమ దగ్గర ఉన్నటు వంటి పశువులను ఇంటికి తీసుకు వెళ్లమని  భార్యకు చెప్పి వెళ్లాడు.సాయంత్రం సుమారుగు 9 గంటలు కావస్తున్న తన  భర్త ఇంటికి తిరిగి రాక పోవడంతో భర్తకు ఫోన్ చేసింది.  ఎన్ని  సార్లు ఫోన్ చేసిన కూడా ఫోన్ ఎత్తక పోవడంతో అనుమానంతో తన మరిది గోపాల్ తో కలిసి తమ పొలానికి దగ్గర ఉన్నటువంటి మున్నూరు సోమారం చెరువు దగ్గరకు సోమవారం ఉదయం 9 గంటల సమయంలో వెళ్లారు. చెరువు ప్రక్కన కాలువ వద్ద తన భర్త శవం, ప్రక్కన దోమ తెర ,మొబైల్ ఫోన్, బ్యాటరీ  పడి ఉన్నాయి. చనిపోయిన వ్యక్తి కుడి కాలుకు మోకాలి క్రింద ఎర్రని టవాలత్ కట్టబడి ఉన్నట్లు గుర్తించడం జరిగింది.దీంతో  తన భర్త చావుకు పలు అనుమానులు  ఉన్నాయని మృతిని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శవానికి పంచనామ నిర్వహించి మృతిని కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. ఈ ఘటన పై దర్యాప్తు చేస్తున్నట్లు సి ఐ ఉఫేందర్ తెలిపారు .ఈ కార్యక్రమంలో ఎసై సంతోష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు .

Comments

comments