Search
Tuesday 20 November 2018
  • :
  • :

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

died-image

హుజూర్‌నగర్ రూరల్: మండల పరిధిలోని మర్రిగూడెం గ్రామంలో విద్యుత్‌షాక్‌తో రైతు మృతిచెందిన సంఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. బందువులు తెలిపిన వివరాల ప్రకారం హుజూర్‌నగర్‌కు చెందిన షేక్ జాని(39) మర్రిగూడెం గ్రామంలో ఉన్న తన వ్యవసాయ పొలంలో మట్టితోలిస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి అక్కడిక్కడే మృతి చెందాడు. గమనించిన స్ధానికులు వెంటనే స్ధానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

బాద్యులపై చర్యలు తీసుకోవాలి… 

విధులలో నిర్లక్షంగా వ్యవహరించిన విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలని మృతుని కుటుంబ బంధువులు అధికారులను డిమాండ్ చేశారు. గతంలో కూడా పలుమార్లు గేదెలు, మేకలు విద్యుత్ వైర్లు తగిలి మృతిచెందినప్పటికీ సంబందిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని, ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఆన్‌ఆఫ్ స్విచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Comments

comments