Home తాజా వార్తలు విద్యుత్ షాక్‌తో రైతు మృతి…

విద్యుత్ షాక్‌తో రైతు మృతి…

Farmer Dies With Current Shock

పూడూరు: ప్రమాదవ శాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఓ రైతు మృతి చెందిన సంఘటన చన్‌గోములు పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..స్థానికుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని చీలాపూర్ గ్రామ పంచాయతీకి చెందిన ఎస్.కృష్ణయ్య(48)కు 5 ఎకరాల భూమి ఉంది. అందులో వివిధ రకాల పంటలు సాగు చేశాడు. మరికొంత వ్యవసాయ పొలంలో టామాటా నారు పెట్టడానికి బోదెలు కొట్టి పనులు చేసుకొని బోరు మోటర్ వద్దకు వచ్చాడు.  తెగిపడిన విద్యుత్ జే వైరుకు ప్రమాదవశాత్తు తగిలాడు. దీంతో విద్యుత్ షాక్ వచ్చి అక్కడిక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతునికి భార్య పార్వతమ్మ, ముగ్గురు కూతుర్లు, 1 కుమారుడు ఉన్నారు. మృతున్ని వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మండలంలో చాలా ప్రాంతాలలో రైతులతో పాటు పశువులు ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కొరారు.