Home భద్రాద్రి కొత్తగూడెం మొక్కజోన్న పంట అగ్ని పాలు…

మొక్కజోన్న పంట అగ్ని పాలు…

corn crop fire accident

 

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని టేకులపల్లి మండలం గోలియా తండా గ్రామ పంచాయితీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గోలియాతండాకు చెందిన మూడ్ లాల్ సింగ్, మూడ్ వీరన్న, మూడ్ నీలాలు వేసంగి పంటగా తమ తొమ్మిది ఎకారలలో మొక్కజొన్న పంట వేసినాడు. ఈ ముగ్గురు లక్షలలో పెట్టుబడి పెట్టి ఎంతో కష్ట పడి తన పొలంలో పని చేసుకొని తీర పంట చేతికి అందే టైంలో సగం పంటను కోసి కుప్పనుర్చారు. మిగతా పంట కోసే టైంలో గురువారం నాడు సాయంత్రం 5 గంటల సమయంలో ఘోర అగ్ని ప్రమాదం సంబావించింది. ఈ అగ్ని ప్రమాదంలో మొత్తం ఐదు మంది రైతులకు నష్టం జరిగింది. వారిలో వాంకుడొతు సోమ్లా చెందిన కంరెట్ మోటర్ల్ 2, సర్వీస్ వైర్, 4 క్వింటాళ పైపులు, ఒక ఎకరంన్నర మాల్భరి తోట కూడ కాలిపోయాయి. మొత్తం మీద 250 బస్తాలయ్యే మొక్కజోన్న పంట అగ్గి పాలు అయింది. నలుగురు రైతులకు మొత్తం మీద ఐదు లక్షలలో నష్టం జరిగింది. దీని పై టేకులపల్లి ఎస్ఐ ప్రవీణ్ కుమారు కేసు నమోదు చేసికొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. సంఘటన స్థలాని జెడ్పిటిసి లక్కీనేని సురేందర్‌రావు, గోలియా తండా సర్పంచ్ బోడ నీరొష, మంగీలాల్ సందర్శించారు. దీనిపై లక్కీనేని సురేందర్‌రావు తన వంతు సహాయంగా ప్రతి రైతుకు పది వేల చొప్పున మొత్తం ఐదుగురికి యాభై వేలు ఆర్థిక సహాయం చేస్తాను అని ప్రకటించారు.

Farmer property loss with corn crop fire accident