Home మహబూబ్‌నగర్ రైతుబంధుకు జేజేలు

రైతుబంధుకు జేజేలు

Jupalli-krishnarao-image

జిల్లా సర్వసభ్య సమావేశంలో నేతల ఆనందం
ప్రశాంతంగా జరిగిన సమావేశం
రైతు సంక్షేమం కోసమే రైతుబంధు
రైతుబీమాను సద్వినియోగం చేసుకోవాలి
నీటి పెండింగ్ బిల్లులను త్వరలోనే పంపిణీ చేస్తాం
రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు
నకిలీ విత్తనాలపై చర్యలు తీసుకుంటాం
జిల్లా జడ్పీ సమావేశంలో మంత్రులు జూపల్లి, లకా్ష్మరెడ్డిలు

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ :  పంటకు పెట్టుబడి లేక ఆపన్న హస్తం కోసం ఎదురు చూసిన రైతన్నకు రాష్ట్ర ప్రభుత్వం దేవుని తరహాలో రైతు బంధు పథకం కింద రూ.8 వేలు పెట్టుబడి సహాయంపై జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం జేజేలు పలికింది.  అనేక నెలలుగా పెండింగ్ పడుతూ వస్తున్న జిల్లా సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ చైర్మన్ భాస్కర్ అధ్యక్షతన శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, లకా్ష్మరెడ్డి, జిల్లా ఇంచార్జీ కలెక్టర్ వెంకట్రావు, వనపర్తి కలెక్టర్ శ్వేతామహంతి, జడ్పీసీఈఓ కొమురయ్య, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరయ్యారు. ముందుగా కొడంగల్ జడ్పీటీసీగా కోర్టు తీర్పుతో ఎంపికైన ముదిగండ్ల మల్లమ్మను జిల్లా ఇంచార్జీ కలెక్టర్ వెంకట్రావు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జరిగిన సమావేశం ప్రశాంతంగా జరిగింది. మక్తల్ జడ్పీటీసీ మాట్లాడుతూ గ్రామాల్లో వేసవి కాలంలో ప్రజల దాహర్తి తీర్చేందుకు ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా నీరు పంపిణీ చేసినప్పటికీ వాటి బిల్లులు ఇప్పటి వరకు పంపిణీ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జడ్పీటీసీలుగా ట్యాంకర్ల వారికి సమాధానం చెప్పలేకపోతున్నామని చెప్పారు. ముందుగా బిల్లులు చెల్లించిన మీదటనే ఆర్‌డబ్లూఎస్‌పై చర్చ జరగాలని పట్టుబడ్డారు. అదేవిధంగా బిసిల ఘనన రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా లెక్కించలేకపోయిందని, దీని వల్ల రాబోయే పంచాయతీ ఎన్నికల్లో బిసిలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. గతంలో 54 శాతంతో జిల్లాలో 6 వేల మంది బిసి సర్పంచ్‌లు ఎన్నిక కాగా బిసిల గణన సక్రమంగా లేని కారణంగా సర్పంచ్ ఎన్నికలు జరిగితే కేవలం 3 వేల మంది బిసిలకే సర్పంచ్ పదవులు దక్కే అవకాశం ఉందని సభ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు కలుగజేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తసుకుని మిషన్ భగీరథను అమలు చేస్తుందని, ప్రతి గ్రామానికి రక్షిత మంచినీటిని అందించాలనే లక్షంతోనే కోట్లు ఖర్చు చేసి ప్రతి గ్రామానికి మంచినీటి సరఫరా చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. గత పాలకుల నిర్లక్షం వల్లే నేటికి తాగునీటి సమస్య ఏర్పడుతుండడం గత పార్టీల నిర్లక్ష ఫలితమేనన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నత లక్షంతో ప్రజా సంక్షేమం కోసం ముందుకెళ్తోందన్నారు. వేసవిలో ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా నీళ్లనుపంపిణీ చేసిన వారికి సకాలంలోనే బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. 2016లో పెండింగ్ బిల్లులను మార్చీలో పంపిణీ చేశామని, 2017 బిల్లులను కూడా పే అండ్ అకౌంట్ ఆఫీస్‌లో పెండింగ్‌లో ఉన్నాయని వాటిని త్వరలో క్లియర్ చేసే ప్రయత్నం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అచ్చంపేట జడ్పీటీసీ మణెమ్మ మాట్లాడుతూ నాగర్‌కర్నూల్ జిల్లాలో అచ్చంపేటలో ఉన్న మహిళా డిగ్రీ కళాశాలను విద్యార్థులు లేరనే సాకుతో కళాశాలను జడ్చర్లకు మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆ ప్రయత్నాన్ని వెంటనే విరమించుకోవాలని సభ దృష్టికి తీసుకొచ్చారు. జిల్లాలో వెనుకబడిన ప్రాంతంగా ఉన్న అచ్చంపేటలో విద్యార్థులకు డిగ్రీ కళాశాల ఉండడం ఎంతో ఉపయోగకరంగా ఉందని అలాంటిది జడ్చర్లకు తరలిస్తే విద్యార్థులు ప్రయాణం చేయలేక చదువు మానుకునే అవకాశం ఉందన్నారు. అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలని చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ జడ్పీటీసీ ధర్మన్న సభవేదిక వద్దకు దూసుకువచ్చి మంత్రిని నిలదీసే ప్రయత్నం చేశారు. దీంతో మంత్రి ఒకింత అసహనం వ్యక్తం చేస్తూ సమావేశం దృష్టికి సమస్యలు ప్రశాంతంగా తీసుకురావాలని సూచించారు. రాజకీయాలు చేయడానికి ఇది వేదిక కాదని, ప్రజా సమస్యల పరిష్కారానికే ఈ సమావేశం నిర్వహిస్తున్నందున సభ్యులు ఎలాంటి ఆదోళనకు గురి కాకుండా సూటిగా సమస్యలను సామరస్యంగా తీసుకురావాలన్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం కింద ప్రతి మండలానికి రూ.25 లక్షలకు పైగా కేటాయించి ప్రతి గ్రామంలో సిసిరోడ్లు వేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ మండలాల్లో సిసిరోడ్లకు నిధులు కేటాయింపు లేవన్న కొంత మంది సభ్యుల ప్రశ్నలకు మంత్రి సూటిగా సమాధానం ఇచ్చారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాలోనే నిధులు ఎక్కువగా మంజూరు చేశామని తెలిపారు. తమ ప్రభుత్వానికి ప్రజలందరూ సమానమేనని ఏ మండలంపై వివక్షత ఉండదని స్పష్టం చేశారు. ఏదైన పొరపాటున మిస్ అయిన మండలాలు ఉంటే వాటికి కూడా పరిశీలించి నిధులు కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణకు దశాబ్ధాల కాలంగా అన్యాయం జరిగినప్పటీకీ సరైన కాలంలో తెలంగాణ కోసం విద్యుత్, సాగునీటి కోసం స్పందించి తాను అప్పట్లో రాజీనామా చేశాను తప్పా వ్యక్తిగత లాభాపేక్ష కోసం కాదని ఆయన చెప్పారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రోజుకు 24 గంటల కరెంటు, తాగు, సాగునీరు , సంక్షేమ పథకాలు, రైతుబంధు వంటి అనేక పథకాల ద్వారా ప్రజలతో మమేకమయినట్లు తెలిపారు. ప్రజల కనీస అవసరాలు తీరుస్తున్నందుకు సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. మిషన్‌భగీరథ ద్వారా 3,413 అవాసాలు ఉండగా ఇప్పటికే 1744 ఆవాస గ్రామాలకు ట్రాయల్న్ నిర్వహించామని, జూన్ మాసాంతం లోగా 1867 అవాస గ్రామాలకు పూర్తి చేస్తామని తెలిపారు. గద్వాల ఎంపిపి సుభాన్ మాట్లాడుతూ గద్వాలలో మిషన్ భగీరథ పనుల ద్వారా సిసిరోడ్లు పాడయ్యాయని వాటికి గురించి పట్టించుకునే నాథుడే లేరని సభ దృష్టికి తీసుకొచ్చారు. కాంట్రాక్టరులు, అధికారులు కుమ్మకైయ్యారని తీవ్రంగా విమర్శించారు. దీనిపై స్పందించిన లకా్ష్మరెడ్డి ఈ సంఘటనపై వెంటనే విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం వ్యవసాయంపై సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్‌లో 2.42 హెక్టార్లకు గాను ఇప్పటి వరకు 66 వేల హెక్టార్లలో ఖరీఫ్ సాగు జరిగినట్లు వ్యవసాయాధికారులు సభ దృష్టికి తీసుకొచ్చారు. కంది, మొక్కజొన్న, జొన్న, పెసలు వంటివి సాగుచేసినట్లు తెలిపారు. గత ఏడాది 2.60 వేల హెక్టార్లలో సాగుకాగా ఈ ఏడాది 2.70 వేల హెక్టార్లలో సాగు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఎరువులు, విత్తనాలకు ఈ ఏదాడి కొరత లేదని, ఈ ఏడాది 5735 క్వింటాళ్లకుగా 4500 క్వింటాళ్ల వరి, 4590 మొక్కజొన్న విత్తనాకలు గాను 1405 క్వింటాళ్ల విత్తనాలు, కంది 266 క్వింటాళ్లకు గాను 44 క్వింటాళ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఎరువులు 26 మెట్రిక్ టన్నులు సిద్ధంగా ఉండగా ఇప్పటి వరకు 18200 మెట్రిక్ టన్నులు నిలువ ఉన్నట్లు తెలిపారు. ఈ పాస్ యంత్రాల ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రైతుబంధు పథకం కింద 3.40 వేల చెక్కులకు గాను ఇప్పటి వరకు 2.61 వేల చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇంకా వివిధ కారణాల వల్ల 70 వేల చెక్కులు పెండింగ్‌లోఉన్నాయని వాటిని కూడా త్వరలోనే అందిస్తామన్నారు. అనంతర మంత్రులు మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి రైతన్నను ఆదుకోవాలనే సకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి కింద ఎకరాకు రూ.8 వేలు పంపిణీ చేస్తోందని ఇది ప్రపంచంలో ఎక్కడా లేదని తెలిపారు. రైతు కుటుంబం బాగుండాలనే లక్షంతో ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు బీమా పథకాన్ని కూడా అమలులోకి తీసుకువస్తున్నారని మంత్రి తెలిపారు. రైతులందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం కల్వకుర్తికి చెందిన జడ్పీటీసీ నకిలీ వేరుశనగ విత్తనాలపై సభ దృష్టికి తీసుకురాగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మంత్రులు హామీ ఇచ్చారు. భోజనం విరామం అంతరం ఖిలాఘనాపూర్ జడ్పీటీసీ లేవనెత్తిన సమస్యలపై ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి స్పందిస్తూ ప్రభుత్వం నిష్పక్షపాతంగా ప్రజల పక్షాన ఉంటూ అందరికి అన్ని పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని ఆయన చెప్పారు. తన నియోజకవర్గంలో అన్ని మండలాలకు సమానంగా నిధులు కేటాయింపులు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా బంగారు తెలంగాణ వైపు ముందుకెళ్తుందని ఆల తెలిపారు. ఎట్టకేలకు జిల్లా సర్వ సభ్య సమావేశం ప్రశాంతంగా జరిగింది.

మాదాసి కురుమలను ఎస్‌సిలో కలపాలి…
మాదాసి కురుమలను ఎస్‌సిలో కలపాలని మాదాసి కురుమలు జిల్లా పరిషత్ సమావేశం బయట ఆందోళనకు దిగారు దీంతో మంత్రులు లకా్ష్మరెడ్డి, జూపల్లి కృష్ణారావులు సమావేశం నుంచి బయటకు వచ్చి వారిని వినతులను స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.