Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఉరి వేసుకుని రైతు మృతి..

Farmer Sucide Attempted In Vikarabaad District
మర్పల్లి ః అనుమానస్పదంగా ఓ రైతు చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన సోమవారం మర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పట్లూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని పట్లూర్ గ్రామానికి చెందిన చాపల సాయన్న (50) అనే రైతు తన పట్టాభూమి సీలింగ్ భూమిగా రావడంతో సరి చేయాలని గత నెల రోజుల నుండి రెవెన్యూ అధికారులు చుట్టూ తిరిగిన ఎవ్వరు పట్టించుకొకపొవడంతొ తీవ్ర మనో వేధనకు గురైయ్యాడు. సాయన్నకు సుమారుగా 7 ఎకారల వరకు భూములున్నాయి. అందులో సర్వే నం. 435లో 3ఎకారల భూమి ఇతని పేరు మీద ఉంది. ఇటివల రెవెన్యూ అధికారులు పంపిణీ చేసిన పాసుబుక్కుల్లో ఈ నంబరుకు సంబందించి నమోదు కాలేదు. సోమవారం ఉదయం కొటమర్పల్లి గ్రామంలో ఉన్న తన కూతురు సంగీతకు సాయన్న బిడ్డ నేను చనిపోతున్నా అందరు మంచిగా ఉండండి అంట్టు పోన్ చేశాడని కూతురు సంగీత విలపించారు. ఈ విషయంను తన అన్నలైన నర్సిములు, నాగేష్‌లకు చెప్పడంతో వారు అప్పటికప్పుడే వారి పొలం వైపు వెళ్లి చూడగా సాయన్న అప్పటికే చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందినట్లు గమనించారు. చెట్టు కింద గొంగడి వేసి దాని కింద జేబులో ఉన్న డైరీ ఇతర కాగితాలు ఉండటం గమనించారు. అందులోనే ఒకాగితంపై విఆర్‌ఒ వెయ్యి రూపాయలు తీసుకుని పాసుబుక్కు ఇవ్వలేదు నాసావుకు కారణం విఆర్‌ఒ, ఇట్లు సాయన్న అని వ్రాసిఉంది.
చిట్టి విషయమై పూర్తి స్తాయిలో విచారణ చేస్తామని చిట్టి మృతుడే వ్రాశాడా మరేవరైన వ్రాసి అక్కడ పెట్టార, తమదైన శైలిలో విచారణ చేస్తామని మృతుడి కుమారుడు నాగేష్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమొదు చేసినట్లు ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపారు.

Comments

comments