Home తాజా వార్తలు రైతు ఆత్మహత్య…

రైతు ఆత్మహత్య…

frmr
ఊరుకొంఢం :అప్పుల బాదతో ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంఘటన సోమవారం మండల పరిధిలోని మాదారం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మాధారం గ్రామానికి చెందిన రైతు కుర్వ చిన్న వెంకటయ్య( 52) అనే వ్యక్తి తనకున్న పొలంతో పాటు మరో 10 ఎకరాలలో పత్తి పంటను సాగు చేశారు.లక్షల్లో ఖర్చు పెట్టి పత్తి పంటను సాగు చేస్తే పత్తిని తీసి అమ్మితే కేవలం 18క్వింటాల్ళు మాత్రమే రావడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలనే బెంగతో మద్యాహ్నం 2.30గంటల సమయంలో తన పొలంలో ఎవ్వరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
పత్తి రైతు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలి
అప్పుల బాదతో ఆత్మ హత్య చేసుకున్న వెంకటయ్య కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని బీజేపి నాయకులు కంభాలపల్లి శ్రీనివాస్‌రెడ్డి , డైరీసెల్ నాయకులు శ్యాంసుందర్‌రెడ్డిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు లేవంటూ గొప్పలు చెప్పే ప్రభుత్వం రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా చూడాల్సిన బాద్యత ప్రభుత్వంపై ఎంతైన ఉందని అన్నారు. ఒకేసారి రైతు రుణమాఫి చేసి ఉంటే ఇలాంటి ఆత్మహత్యలు జరిగి ఉండేవి కావని అన్నారు.