Home తాజా వార్తలు మహబూబ్ నగర్ కలెక్టరేట్ ముందు రైతు ఆత్మహత్యయత్నం…

మహబూబ్ నగర్ కలెక్టరేట్ ముందు రైతు ఆత్మహత్యయత్నం…

Farmer-Suicide-attempt

మహబూబ్‌నగర్: ఓ రైతు మహబూబునగర్ కలెక్టరేట్ ఎదుట తనతో తెచ్చుకున్న కిరోసిన్ డబ్బా మూత తీసి ఒంటిపై పోసుకొని ఆత్మహత్య యత్నానికి యత్నించాడు. కాగా రైతు యాదయ్యను కలక్టరేటు ముందున్న వారు అడ్డుకున్నారు. అసలేం జరిగిదంటే..వివరాలలోకి వెళితే… జిల్లాలోని జడ్చర్ల మండలంలోని భూరెడ్డి పల్లి గ్రామానికి చెందిన రైతు తన భూమిని టిఆర్‌ఎస్ నేత యాదిరెడ్డి కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు. తన భూమిని యాదిరెడ్డి కబ్జా చేశాడని అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు తన ఫిర్యాదు స్వీకరించడం లేదని రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు యాదయ్య కలెక్టరేట్ ముందు ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాడు.

Farmer Suicide Attempt At Mahabubnagar Collectorate