Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

సిఎం క్యాంప్ ఆఫీసు ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం

FARMER-1

హైదరాబాద్ : హైదరాబాద్‌లోని సిఎం క్యాంప్ ఆఫీసు వద్ద ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్పుల బాధతో ఆందోళన చెందుతున్న  జోగులంబ గద్వాల జిల్లాకు చెందిన రైతు మల్లేశ్ వ్యవసాయ భూమిలో ఐదు బోర్లు వేశాడు. కానీ ఒక్క చుక్క నీరు కూడా పడలేదు. బోర్లను తవ్వించేందుకు రెండు లక్షల వరకు అప్పు చేశాడు. అప్పు తీర్చే మార్గం కనిపించకపోవడంతో సిఎం కెసిఆర్‌ను ఆశ్రయించాలని హైదరాబాద్‌కు వచ్చాడు. అయితే సిఎం క్యాంప్ ఆఫీసు వద్ద అతడిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అనంతరం మల్లేశ్ పురుగుల మందు తాగి మళ్లీ సిఎం క్యాంప్ ఆఫీసు వద్దకు వచ్చాడు. మల్లేశ్ నుంచి పురుగుల మందు వాసన రావడాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది తక్షణమే అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతోనే తాను ఆత్మహత్యాయత్నం చేసినట్టు మల్లేశ్ తెలిపారు. తనను ఆదుకోవాలని ఆయన సిఎం కెసిఆర్‌ను కోరుతున్నారు.

Comments

comments