Home తాజా వార్తలు అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

FARMERమెదక్ : అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన దుబ్బాక మండలం పోతరెడ్డిపేటలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన బాలయ్య అనే రైతు అప్పు చేసి తనకున్న నాలుగు ఎకరాల్లో పంట సాగు చేశాడు. వర్షాలు లేకపోవడంతో పంట ఎండిపోయింది. దీంతో అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. మనస్తాపం చెందిన బాలయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. బాలయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆ గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు.