Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ప్రభుత్వ అవివేక విధానాలతోనే రైతు ఆత్మహత్యలు

కేంద్రం సమగ్ర వ్యవసాయిక  విధానాన్ని ప్రకటించాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి  చాడ వెంకటరెడ్డి

Chada-Venkat-Reddy

సిరిసిల్ల: కేంద్ర ప్రభుత్వం సమ గ్ర వ్యవసాయిక విధానాన్ని ప్రకటించాలని, ప్రభు త్వ అవివేక విధానాలతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయం కార్మిక భవనంలో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ ఎ న్నికల్లో గెలుపు కోసం ప్రధాని మోడీ రుణమాఫీ ప్రకటన చేసినా, ప్రస్తుతం అంగీకరించడం లేద న్నారు. పారిశ్రామికవేత్తల కోసం ఇప్పటివరకు రూ.10 లక్షల కోట్లు మాఫీ చేసిన ప్రభుత్వం రైతు లకు ప్రయోజనం కలిగించే రుణమాఫీకి శూన్య హస్తాలు చూపించడం దారుణమన్నారు.

పెద్ద నో ట్ల రద్దు నాటి పరిస్థితి దేశవ్యాప్తంగా నేటికీ మార లేదన్నారు. నల్లధనాన్ని దేశానికి తీసుకురావడం లో ప్రధాని మోడీ విఫలమయ్యారన్నారు. వాణి జ్య పంటైన మిర్చికి కేంద్రం ఎందుకు మద్దతు ధర ప్రకటించడం లేదని చాడ ప్రశ్నించారు. రా ష్ట్రంలో సిఎం కెసిఆర్ రైతులకు రుణమాఫీ చేస్తా నని నేటికీ పూర్తిగా మాఫీ చేయలేదని వాపోయా రు. మూడేళ్లుగా రూ.లక్ష మాఫీకి వడ్డీయే 50 వేలు దాటిందని పేర్కొన్నారు. అలాగే నేటికీ సా గునీటి విధానం ఏర్పడలేదన్నారు. రైతాంగ, ప్ర జా సమస్యలు వినేందుకు కెసిఆర్ సిద్ధంగా లేరని విమర్శించారు.

లారీల సమ్మెను విరమింపజేయాలి

లారీల సమ్మె ఆదివారంతో నాలుగో రోజుకు చే రిందని, ఫలితంగా సోమవారం నుంచి అన్ని ర కాల మార్కెట్లు బంద్ పాటించనున్నాయని చెప్పా రు. ఇదే విషయమై అఖిల భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ప్రధాని మోడీకి లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేశా రు. సామాన్యులను ఇబ్బందులు పడకుండా ప్ర భుత్వం చొరవ చూపాల్సిన అవసరం గుర్తించాల న్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్త లు పాల్గొన్నారు.

Comments

comments