Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

రైతు ఆత్మహత్యలు తగ్గాయి

kadiyam*72 లక్షల మంది రైతులకు రూ.12వేల కోట్ల పెట్టుబడి
*42 లక్షల పేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు
*రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి

మన తెలంగాణ/వరంగల్‌బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం హన్మకొండలోని విష్ణుప్రియ గార్డెన్‌లో వరంగల్ రూరల్ జిల్లా ఒడిఎఫ్ కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కడియం శ్రీహరి మాట్లాడుతూ రైతు ఆత్మహత్యలపై దేశవ్యాప్తంగా జరిగిన అధ్యయనంలో తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని తేలిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తోందన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే లక్షరూపాయల లోపు అప్పులన్నింటిని ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. గత డిసెంబర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తుందన్నారు. ఈ ఖరీఫ్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 72లక్షల మంది రైతులకు ఎకరానికి 4వేల రూపాయల చొప్పున రెండు పంటలకుగాను 8వేల రూపాయల ఆర్థికసాయం అందించబోతున్నామని, మొత్తం 12వేల కోట్ల రూపాయల వ్యవసాయ పెట్టుబడి అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 42లక్షల మంది పేద కుటుంబాల సంక్షేమానికి 2500 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామని కడియం తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి,షాదీముబారక్ పథకం, కెసిఆర్ కిట్‌లు దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని అన్ని పల్లెలకు గోదావరి,కృష్ణ జలాలను శుద్ధి చేసి ప్రతి ఇంటికి తాగునీరు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని కడియం పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి పల్లెలే పట్టుకొమ్మలని అందుకే రాష్ట్రంలో పంచాయతీలకే అధికారాలను కట్టబెడుతున్నామని, దేశంలోనే విప్లవాత్మకమైన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకరావడంతోపాటు 500 జనభా కలిగిన తండాలను, గిరిజన గూడెలాను పంచాయతీలుగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ గద్దల పద్మ, రాష్ట్ర పౌరసరఫరా సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు, జిల్లా కలెక్టర్ ఎం.హరిత, పరకాల ఎంఎల్‌ఎ చల్లా ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments