Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

కరెంట్‌షాక్‌తో రైతు మృతి

West Godavari : Farmer was Killed by Electrocution at Tadepalligudem

పశ్చిమగోదావరి : విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన తాడేపల్లిగూడెం రూరల్ కడియద్ద గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. సుబ్రహ్మణ్యం (38) అనే రైతు పొలంలో పని చేస్తుండగా ఎర్త్‌వైర్ తగలి అక్కడికక్కడే చనిపోయాడు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ గ్రామ ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పోస్టుమార్టం నిమిత్తం సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని గూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Farmer was Killed by Electrocution at Tadepalligudem

Comments

comments