Home జయశంకర్ భూపాలపల్లి రైతులంటే అలుసా..నిరుద్యోగులతో ఆటలా..

రైతులంటే అలుసా..నిరుద్యోగులతో ఆటలా..

cong= ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కెసిఆర్ సర్కార్ తీరు
= డబుల్‌బెడ్ రూమ్‌లు కట్టింది ఎక్కడ?
= మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి

మన తెలంగాణ/చిట్యాల: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రజలను మభ్యపెట్టి, మోసంచేసి మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కెసిఆర్ ప్రభుత్వం ప్రజలకు ఒరగపెట్టిందేమీ లేదని మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని చైన్‌పాక శివారు వెంచరామి గ్రామానికి గండ్ర రమణన్న రైతు భరోసా యాత్ర చేరుకోవడంతో అక్కడి మహిళలు ఆయనకు హారతులతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెంకటరమాణారెడ్డి మాట్లాడుతూ రైతులంటే కెసిఆర్‌కు అంతా అలుసా అని అన్నారు. రైతులు వేసిన పంటలకు గిట్టుబాటు ధరలులేక సరిగా పంటలు పండక అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం వారి కుటుంబాలను పరామర్శించలేదని అయన మండి పడ్డారు. రైతులకు ఎకరాకు రూ.4 వేలు ఇవ్వడం పెపరు ప్రకటనలకే సరిపోతుందని అమలు చేయడంలో విఫలం చేందుతున్నారని అన్నారు. రైతులను మోసంచేసిన ప్రభుత్వాలు ఎరోజు బాగుపడలేదని తెలిపారు. ఎన్నికల ముందు నిరుపేదలకు డబుల్ బెడ్ రూంలు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చి నాలుగు సంవత్సరాలు గడుస్తున్న నియోజక వర్గంలో ఎక్కడ కుడా పూర్తి కాలేదని అన్నారు. గ్రామాలలో కోంత మంది టిఆర్‌ఎస్ నాయకులు ఇతర పార్టీల నాయకులను టిఆర్‌ఎస్‌లో చేరితెనే డబుల్ బెడ్ రూంలు, కార్పోరెషన్ రుణాలు ఇప్పిస్తామని లేకుంటే, పేర్లు తోలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఇలాంటివి చేయడం సిగ్గు చేటని అన్నారు. రాష్రం ఎర్పాడగానే తెలంగాణలో ఎఒక్క రు నిరుద్యోగులుగా ఉండకుడదని చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేల చర్యలు తిసుకుంటామని చేప్పిన కెసిఆర్ ప్రభుత్వం ఇప్పడు మాట మార్చి చదువుకున్న ప్రతిఒక్కరికి ఉద్యోగాల ఏవిదంగా వస్తాయని అనడం సరైందికాదని అన్నారు. నిరుద్యోగులతో చెలగాటం ఆడటం నిప్పుతో చెలగాటం ఆడటమేనని అన్నారు. రాష్ట్రంలో కుటుంబపాలన కొనసాగుతుందని, దాని కి అంతిమా మార్గం ప్రజలే చూపిస్తారని అన్నారు. మంత్రి వర్గంలో ఎఒక్క మహిళా మంత్రులు లేకుండా పాలన కొనసాగించడం అవివేకమని అన్నారు. కెసిఆర్ మాటల గారడిలో ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రానున్న రోజులు కాంగ్రెస్ పార్టీవే అని అన్నారు.కాంగ్రేస్ అధికారంలోకి రాగానే రైతులకు 2లక్షల రుణ మాపి,పంట వెయ్యక ముందే పంటకు మద్దతుధర నిర్ణయం , మిర్చికి 10000/, పత్తికి 6000/,మొక్క జోన్నకు 2000/,వడ్లకు 2000/,కందులకు 6000/, నిరుద్యోగలకు నెలకు 3000/ నిరుద్యోగ భృతి ఇవ్వటం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కార్యదర్శి గండ్ర జ్యోతి, జిల్లా నాయకులు దొమ్మటి సాంబయ్యగండ్ర గౌతం రెడ్డి, పిసిసి మెంబర్ చల్లూరి సమ్మయ్య, మండల అధ్యక్షుడు గొర్రె సాగర్, నగర్, మొగుళ్ళపల్లి, శాయం పేట, గణపురం, రెగోండ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాగర్, బుర్ర రమేష్, లక్ష్మినరసింహారావు, తిరుపతిరెడ్డి, జనార్థన్, దెవేందర్‌రెడ్డి , దేవన్, దామెర రాజు, కట్టెకోళ్ళ రాజు, కోక్కల రాజు, పర్లపెల్లి భద్రయ్య, కాసు కుమార్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.